Viral Video: ఇలాంటి క్రికెట్ కమెంటరీని ముందెప్పుడూ వినుండరు.. వైరల్ వీడియో చూసేయండి
సంస్కృత భాషలో క్రికెట్ మ్యాచ్‌ను వ్యాఖ్యానం చేయడం ఎప్పుడైనా విన్నారా.. అసలు అలా జరుగుతుంది అని ఎప్పుడైనా ఎవరైనా ఊహించారా? ఇది ఖచ్చితంగా భిన్నమైన అనుభవం అవుతుంది. బెంగుళూరుకు చెందిన ఒక యువకుడు స్ట్రీట్ క్రికెట్ ఆట జరుగుతున్న సమయంలో కామెంటరీ చెప్పడం మొదలు పెట్టాడు. క్రీడాకారుల ఆట తీరుని ఆడుతున్న విధానం గురించి అనర్గళంగా సంస్కృతంలో వ్యాఖ్యానిస్తున్నాడు. ఆ యువకుడు సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడే నైపుణ్యంతో ఇంటర్నెట్ జనాలను ఆశ్చర్యపరిచాడు.
క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే క్రీడాకారుల ఆటతీరుని వివరిస్తూ చేసే వ్యాఖ్యానం గురించి తెలిసిందే. ఎక్కువగా క్రికెట్ మ్యాచ్ కామెంటరీ ఇంగ్లీష్ లో జరుగుతుంది. అయితే ఐపిఎల్ మ్యాచ్ లు వచ్చిన తర్వాత తెలుగు, తమిళం వంటి ప్రాంతీయ భాషల్లో కూడా మ్యాచ్ గురించి కామెంటరీ ఇస్తున్నారు. అయితే సంస్కృత భాషలో క్రికెట్ మ్యాచ్‌ను వ్యాఖ్యానం చేయడం ఎప్పుడైనా విన్నారా.. అసలు అలా జరుగుతుంది అని ఎప్పుడైనా ఎవరైనా ఊహించారా? ఇది ఖచ్చితంగా భిన్నమైన అనుభవం అవుతుంది. బెంగుళూరుకు చెందిన ఒక యువకుడు స్ట్రీట్ క్రికెట్ ఆట జరుగుతున్న సమయంలో కామెంటరీ చెప్పడం మొదలు పెట్టాడు. క్రీడాకారుల ఆట తీరుని ఆడుతున్న విధానం గురించి అనర్గళంగా సంస్కృతంలో వ్యాఖ్యానిస్తున్నాడు. ఆ యువకుడు సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడే నైపుణ్యంతో ఇంటర్నెట్ జనాలను ఆశ్చర్యపరిచాడు. ఆసక్తికరమైన ఈ వీడియో క్లిప్‌ను సమష్టి గుబ్బి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
వైరల్ వీడియోలో ఏముందంటే?
View this post on Instagram
ఒక యువకుడు సంస్కృతంలో స్ట్రీట్ లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని అందించడం కనిపించింది. ఇందులో కొద్దిగా స్లెడ్జింగ్ కూడా ఉంది. ఇష్టమైన బ్యాట్స్‌మన్ పార్క్ వెలుపల బంతిని కొట్టినట్లు టీవీలో వ్యాఖ్యాత చేసినట్లే.. బ్యాటింగ్ చేస్తున్న వ్యక్తీ బంతిని కొట్టినప్పుడు అతని స్వరం హెచ్చు స్థాయికి చేరుకుంది. కామెంటరీ చెబుతున్న యువకుడి చుట్టూ ఉన్న వ్యక్తులు.. ఫోనలకు పని చెప్పారు. అతడు కామెంటరీ చెబుతున్న స్టైల్ ని ప్రశంసించారు.
క్రికెట్ మ్యాచ్ లో సంస్కృతంలో ఆ యువకుడు చెప్పిన కామెంటరీ ని అనువదిస్తే.. “బౌలర్ చేతిలో బంతి ఉంది. బౌలర్ దూరం నుండి వస్తున్నాడు. .. బౌలర్ వేసే సమయంలో బ్యాట్స్ మెన్ మంచి షాట్‌ని కొట్టాలని చూస్తున్నాడు. బ్యాట్స్ మాన్ పరుగు పూర్తీ చేయడం కోసం వేగంగా పరుగు తీస్తున్నాడు. ఇప్పుడు వారు చర్చించుకోవడానికి విరామం. .. తరువాత ఏమి జరుగుతుందో చూద్దాం. అందరూ ఉత్సాహంగా ఆడుతున్నారు. బౌలర్ మళ్లీ చేరుకుని మరో మంచి ప్రదర్శనను అందించాడు. చాలా బాగా ఆడుతున్నాడు. అతని పేరు మంజునాథ్. వేగంగా పరుగెత్తండి. అంటూ కామెంట్ చేస్తున్నాడు. వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్ల ను విపరీతంగా ఆకట్టుకుంది. సోషల్ మీడియా వినియోగదారులు అతని వ్యాఖ్యాన శైలి, సంస్కృత భాషపై కమాండ్ ను వాక్ పటిమను ప్రశంసించారు. “అద్భుతమైన వ్యాఖ్యానం,” ఒకరు ప్రశంసించారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..