Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అయ్య బాబోయ్.. విమానం విండ్‌షీల్డ్‌ను ఇలా కూడా క్లీన్ చేస్తారా..!

ఈ 19 సెకనుల క్లిప్ కొద్దిసేపటికే వైరల్ అయ్యింది. పబ్లిక్ లో చాలా సందడి చేయడం ప్రారంభించింది. పాకిస్థానీయులు మాత్రమే దీన్ని చేయగలరని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. అదే సమయంలో మరొక వినియోగదారు విమానయాన సంస్థలు కూడా రోడ్డు మార్గాల గుండా వెళ్ళాయా? అని కామెంట్ చేయగా.. ఇంకొకరు అక్కడ చాలా అభివృద్ధి జరిగింది... ఎంతగా అంటే నేరుగా రోడ్డు మార్గాల నుండి విమానాలు వెళ్ళేంతగా అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు.

Viral Video: అయ్య బాబోయ్.. విమానం విండ్‌షీల్డ్‌ను ఇలా కూడా క్లీన్ చేస్తారా..!
Viral Video
Surya Kala
| Edited By: Janardhan Veluru|

Updated on: Sep 03, 2024 | 6:43 PM

Share

పొరుగు దేశం పాకిస్థాన్‌ నుంచి సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇంటర్నెట్‌ జనాలను నవ్విస్తోంది. ఈ వీడియో విమానాశ్రయం నుండి వచ్చింది. దీనిలో ఒక పైలట్ విమానం కాక్‌పిట్ నుండి వేలాడుతూ.. విండ్‌షీల్డ్‌ని బట్టతో శుభ్రం చేస్తునట్లు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియోపై జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు.. సరదాగా మాట్లాడుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారి ప్రజల ఆలోచనల్లోని విభిన్న కోణాలను ఎలా బయటపెడతాయో చెప్పడానికి ఈ సంఘటనే ఉదాహరణ. తాజా వీడియోలో పాకిస్తాన్ పైలట్ విమానం కిటికీకి వేలాడుతూ విండ్‌షీల్డ్‌ను శుభ్రం చేయడం చాలా మందికి ఒక జోక్ గా కనిపిస్తోంది. @askshivanisahu X హ్యాండిల్‌లో షేర్ చేసిన ఈ వీడియోకి ఇంతకు ముందు రోడ్‌వేస్‌లో పని చేశారా అనే కామెంట్ జత చేశారు.

ఈ 19 సెకనుల క్లిప్ కొద్దిసేపటికే వైరల్ అయ్యింది. పబ్లిక్ లో చాలా సందడి చేయడం ప్రారంభించింది. పాకిస్థానీయులు మాత్రమే దీన్ని చేయగలరని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. అదే సమయంలో మరొక వినియోగదారు విమానయాన సంస్థలు కూడా రోడ్డు మార్గాల గుండా వెళ్ళాయా? అని కామెంట్ చేయగా.. ఇంకొకరు అక్కడ చాలా అభివృద్ధి జరిగింది… ఎంతగా అంటే నేరుగా రోడ్డు మార్గాల నుండి విమానాలు వెళ్ళేంతగా అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి

విమానం నుండి వేలాడుతూ పైలట్ విండ్‌షీల్డ్‌ను శుభ్రం చేస్తున్న వీడియోను ఇక్కడ చూడండి

అయినప్పటికీ పైలట్ ఇపుడు చేస్తున్న ఈ పని అతని బాధ్యతలో భాగమని.. ఇది సాధారణ ప్రక్రియ అని కొందరు వినియోగదారులు అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలోని ప్రతి విషయాన్ని జోక్‌గా చూడకూడదని ఈ సంఘటన తెలియజేస్తోంది. కొన్ని పనులు చూడడానికి సరదాగా అనిపించవచ్చు.. వాస్తవానికి అవి భద్రతకు, బాధ్యతకు సంబంధించినవి కావొచ్చు.

ఇది పైలట్ ప్రాథమిక విధి అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. టేకాఫ్‌కు ముందు విండ్‌షీల్డ్‌ నుంచి స్పష్టంగా కనిపించక పొతే చాలా ప్రమాదం కనుక దానిని శుభ్రం చేయాలి. లేకపోతే ఏ పక్షి ఎప్పుడు ఢీకొంటుందో కూడా తెలియదని కామెంట్ చేయగా మరొకరు ప్రతి పైలట్ దీన్ని చేస్తాడు. ఇది ఎగతాళి చేసే విషయం కాదన్నారు. భారతదేశంతో సహా అనేక దేశాల్లో పైలట్లు ఇలా చేయడం నేను చూశాను. ఇది సాధారణ ప్రక్రియని అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..