Skin Care Tips: తెలుపు నలుపుతో పని ఏముంది స్కిన్ అద్దంలా మెరిస్తేనే అందం.. రైస్ వాటర్‌తో స్కిన్‌కేర్ టిప్స్ మీ కోసం

సహజంగా ఆరోగ్యకరమైన, మెరిసే చర్మం ఉన్నా తప్పకుండా చర్మ సంరక్షణ చేసుకోవాల్సిందే. అయితే సహజమైన వాటి వల్ల చర్మం లేదా ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం చాలా తక్కువ. బియ్యం చాలా ఇళ్లలో దొరుకుతుంది. ఈ బియాన్ని చర్మ సంరక్షణ కోసం కూడా ఉపయోగించవచ్చు. కనుక ఈ రోజు బియ్యంతో స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం..

Skin Care Tips: తెలుపు నలుపుతో పని ఏముంది స్కిన్ అద్దంలా మెరిస్తేనే అందం.. రైస్ వాటర్‌తో స్కిన్‌కేర్ టిప్స్ మీ కోసం
Rice Water For Skin
Follow us

|

Updated on: Sep 03, 2024 | 5:56 PM

ఆరోగ్యకరమైన, శుభ్రమైన అందమైన చర్మాన్ని పొందడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఒకొక్కసారి కాస్మెటిక్ చికిత్సలను కూడా ఆశ్రయిస్తారు. ఇవి చాలా ఖరీదైనవి మాత్రమే కాదు వీటి ప్రభావం కూడా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ చికిత్స తీసుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. ఒకొక్కసారి ఇలాంటి చికిత్సలు దుష్ప్రభావాల బారిన పడేలా చేస్తాయి అనే భయం కూడా ఉంది. మార్కెట్లో చాలా సౌందర్య ఉత్పత్తులు ఉన్నాయి. ఇవి ఛాయను మెరుగుపరుస్తాయి.. అయితే వీటిలో కొన్ని రసాయనాలు ఉంటాయి. కనుక చర్మానికే కాదు ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తాయి. అందుకనే అందమైన శుభ్రమైన చర్మం కోసం సహజసిద్ధమైన వస్తువులతో తగిన జాగ్రత్తలు తీసుకుంటే చర్మం ఆరోగ్యవంతంగా మారుతుంది. స్కిన్ మెరుస్తుంది కూడా..

సహజంగా ఆరోగ్యకరమైన, మెరిసే చర్మం ఉన్నా తప్పకుండా చర్మ సంరక్షణ చేసుకోవాల్సిందే. అయితే సహజమైన వాటి వల్ల చర్మం లేదా ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం చాలా తక్కువ. బియ్యం చాలా ఇళ్లలో దొరుకుతుంది. ఈ బియాన్ని చర్మ సంరక్షణ కోసం కూడా ఉపయోగించవచ్చు. కనుక ఈ రోజు బియ్యంతో స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం..

స్క్రబ్బింగ్ కోసం

ఇవి కూడా చదవండి

చర్మం ఆరోగ్యంగా ఉండటానికి.. లోతుగా శుభ్రపరచుకోవడం అవసరం. దీని కోసం వారానికి ఒకసారి స్క్రబ్బింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వలన మృత చర్మ కణాలు కూడా తొలగించబడతాయి. ఇందుకోసం ఒక చెంచా బియ్యప్పిండిని తీసుకుని అందులో ఆకు నుంచి తీసిన తాజా అలోవెరా జెల్‌ను బాగా కలపాలి. ఇప్పుడు దీనితో ముఖ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయండి, మీకు కావాలంటే ఈ మిశ్రమాన్ని చేతులు, కాళ్ళకు కూడా ఉపయోగించవచ్చు.

స్కిన్ బ్రైటెనింగ్ ఫేస్ మాస్క్

స్కిన్ టోన్ మెరుగుపరచడానికి, చనిపోయిన చర్మ కణాలను తొలగించడాని బియ్యం పిండి, బంగాళాదుంప రసం, కొన్ని చుక్కల నిమ్మరసం తీసుకోండి. ఈ మూడు పదార్థాలను మిక్స్ చేసి, రోజ్ వాటర్ వేసి మంచి పేస్ట్‌ను సిద్ధం చేయండి. ఈ ఫేస్ మాస్క్‌ను ముఖంపై అప్లై చేసి కనీసం 20 నిమిషాల పాటు ఉంచి, ఆపై శుభ్రమైన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఈ ఫేస్ మాస్క్‌ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు అప్లై చేయండి.

స్కిన్ బ్రైటెనింగ్ జెల్

ఫేస్ మాస్క్ అప్లై చేసిన తర్వాత ముఖంపై స్కిన్ బ్రైటెనింగ్ జెల్ రాయండి. దీన్ని చేయడానికి ఒక చెంచా రోజ్ వాటర్, ఒక చెంచా రైస్ వాటర్, ఒక చెంచా అలోవెరా జెల్ కలపాలి. దీన్ని గ్రైండర్‌లో వేసి పేస్ట్‌లా చేసి, ఆపై ముఖానికి 10 నిమిషాల పాటు అప్లై చేయాలి. 4 నుంచి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి ఆపై ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

టోనర్ సిద్ధం

రంధ్రాలు ఎక్కువగా తెరుచుకుంటే చర్మపు ఆకృతిలో మార్పులు కనిపిస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే బియ్యాన్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే ఈ నీటిని ఫిల్టర్ చేయాలి. ఇప్పుడు దానిలో సమాన పరిమాణంలో రోజ్ వాటర్ కలపండి. తయారుచేసిన ద్రవాన్ని స్ప్రే బాటిల్‌లో నింపి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయండి. ఈ ద్రవాన్ని మీ ముఖం నుండి మెడ వరకు క్రమం తప్పకుండా అప్లై చేసుకోండి.

రైస్ ఫ్లోర్ ఐస్ క్యూబ్స్

వేసవిలో మీ చర్మాన్ని తాజాగా ఉంచడానికి సాదా నీటితో తయారు చేసిన ఐస్ క్యూబ్‌లను ఉపయోగించే అలవాటు ఉంటె.. దాని స్థానంలో రైస్ వాటర్‌తో ఐస్ క్యూబ్స్ తయారు చేసుకోండి. ఇందుకోసం బియ్యం నీళ్లను తీసుకుని అందులో కొన్ని చుక్కల నిమ్మరసంతోపాటు అలోవెరా జెల్ కూడా వేయాలి. ముందుగా ఈ మూడు వస్తువులను ఒకసారి గ్రైండర్‌లో వేసి, ఆపై ఐస్ క్యూబ్‌ ట్రే లో ఈ మిశ్రమాన్ని వేసి గడ్డకట్టేలా ఉంచండి. ముఖం నీరసంగా లేదా అలసిపోయినట్లు కనిపిస్తే ఈ ఐస్ క్యూబ్స్‌తో ముఖాన్ని మసాజ్ చేసుకోండి. వెంటనే ముఖంలో ఫ్రెష్ నెస్ ఫీలింగ్ వస్తుంది. ప్రతిరోజూ ఒకసారి అప్లై చేయడం ద్వారా ఛాయ క్రమంగా మెరుగుపడుతుంది. స్కిన్ గ్లో కూడా పెరుగుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్త కోసం క్లిక్‌ చేయండి..

Note: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.