Lifestyle: తినడం మానేస్తే బరువు తగ్గుతారా.? అసలు విషయం ఏంటంటే..

బరువు పెరగడం చాలా మంది ఎదుర్కొనే సమస్య. ఇటీవల ఈ సమస్య బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, జీవన శైలిలో మార్పుల కారణంగా ఊబకాయం వేధిస్తుంది. ఇక బరువు పెరగడం మొదలుకాగానే చాలా మంది ఆందోళన చెందుతుంటారు. ఎలాగైనా వెంటనే బరువు తగ్గాలని ఆతృతతో ఉంటారు...

Lifestyle: తినడం మానేస్తే బరువు తగ్గుతారా.? అసలు విషయం ఏంటంటే..
Weightloss
Follow us

|

Updated on: Sep 03, 2024 | 6:14 PM

బరువు పెరగడం చాలా మంది ఎదుర్కొనే సమస్య. ఇటీవల ఈ సమస్య బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, జీవన శైలిలో మార్పుల కారణంగా ఊబకాయం వేధిస్తుంది. ఇక బరువు పెరగడం మొదలుకాగానే చాలా మంది ఆందోళన చెందుతుంటారు. ఎలాగైనా వెంటనే బరువు తగ్గాలని ఆతృతతో ఉంటారు. ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. బరువు తగ్గడానికి సంబంధించి మనలో చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. ఇంతకీ ఏంటా ఆ అపోహలు ఏంటి.? వాటిలో ఉన్న అసలు నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* గ్రీన్‌ టీ తాగడం వల్ల బరువు తగ్గొచ్చనే భావన మనలో చాలా మందికి ఉండే ఉంటుంది. సహజంగానే హెర్బల్ టీలో ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అయితే నేరుగా బరువు తగ్గడంలో మాత్రం హెర్బల్‌ టీ ఉపయోగపడదని నిపుణులు చెబుతున్నారు.

* ప్యాక్‌ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారన్న దాంట్లో పూర్తిగా నిజం ఉంది. ప్యాక్‌ చేసిన ఆహారంలో ఉప్పుతో పాటు కొవ్వు ఎక్కువగా ఉంటుంది. దీంతో బరువు పెరగడానికి కారణమవుతుంది. అందుకే వీటికి బదులుగా ఇంట్లో చేసిన ఫుడ్‌ను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

* ఇక మనలో చాలా మందికి ఉండే అపోహల్లో ఆహారం తక్కువగా తింటే బరువు తగ్గుతామని. నిజానికి తక్కువ తింటే బరువు తగ్గుతారనడంలో ఎలాంటి నిజం లేదు. కేలరీలు తగ్గడం ఒక్కటే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అందుకే తక్కువ తినడం కంటే తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే కేలరీలు బర్న్‌ కావడానికి వాకింగ్, జాగింగ్‌ వంటివి చేయడం అలవాటు చేసుకోవాలి. వ్యాయామం ద్వారానే త్వరగా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు.

* ఇక కొందరు ఉపవాసాలు చేయడం, క్రాష్‌ డైట్‌తో త్వరగా బరువు తగ్గొచ్చని భావిస్తారు. కానీ ఇందులో కూడా నిజం లేదు. ఇలా చేయడం వల్ల నిజానికి బరువు పెరుగుతారు. దీనికి కారణం తక్కువ తినడం వల్ల శరీరంలో శక్తి తగ్గడంతో పాటు.. కొవ్వు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినలానే కోరిక పెరుగుతుంది. ఆకలి ఎక్కువైతే బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంవ5ధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..