Health: హెల్తీ ఫుడ్ అంటే ఏంటి.? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చేబుతోంది..

ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగా తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పులు ఎక్కువగా ఉండాలని చెబుతున్నారు. కచ్చితంగా ప్రతీరోజూ ఆహారంలో ఆకు కూరలు ఉండాలని సూచిస్తున్నారు. ఇక వీటితో పాటు సీజనల్ ఫ్రూట్స్‌ను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఉప్పు విషయంలో...

Health: హెల్తీ ఫుడ్ అంటే ఏంటి.? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చేబుతోంది..
Health
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 03, 2024 | 7:20 PM

మనం తీసుకునే ఆహారంపైనే మన మన ఆరోగ్యం ఆధారపడి ఉందుంటదని తెలిసిందే. మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంమెరుగువుతుంది. అయితే ఇంతకీ మంచి ఆరోగ్యాన్ని ఎలా నిర్వచిస్తారనే సందేహం రావడం సర్వసాధారణం. ఇందులో భాగంగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్‌ డైట్‌కు సంబంధించి ఒక డైట్‌ చార్ట్ విడుదల చేసింది. దీనిబట్టి మంచి ఆహారం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగా తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పులు ఎక్కువగా ఉండాలని చెబుతున్నారు. కచ్చితంగా ప్రతీరోజూ ఆహారంలో ఆకు కూరలు ఉండాలని సూచిస్తున్నారు. ఇక వీటితో పాటు సీజనల్ ఫ్రూట్స్‌ను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఉప్పు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. రోజు మొత్తంగా ఒక చెంచాను మించి ఉప్పు తీసుకోవద్దని అంటున్నారు. అలాగే ఆహారంలో ట్రాన్స్ ఫ్యాట్స్ తీసుకోవడం మానేయాలి. మాంసం, కాల్చిన, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి.

ఇక తీసుకునే ఆహారంలో వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకూడదు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. వెన్న, నెయ్యికి బదులుగా, పాలీసాచురేటెడ్ కొవ్వులు ఉన్న నూనెను ఉపయోగించాలి. సోయాబీన్, కనోలా, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు నూనె వంటివి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. అధిక చక్కెర మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. దీంతో పాటు ఊబకాయం కూడా పెరగడం మొదలవుతుంది. చక్కెర తీసుకోవడం తగ్గించాలి. ఇందుకోసం కార్బోనేటేడ్ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్స్, రెడీ టు డ్రింక్ టీ, ఫ్లేవర్డ్ మిల్క్ వంటి వాటికి దూరంగా ఉండాలి.

ఇక తీసుకునే ఆహారంలో ధాన్యాలు, మిల్లెట్లు ఉండేలా చూసుకోవాలి. పప్పులు, మాంసం ఆహారాలు, గుడ్లు, డ్రై ఫ్రూట్స్, నూనె గింజలు, పెరుగు ఉండాలి. తీసుకునే ఆహారంలో 45 శాతం వరకు గింజలు ఉండాలి. అయితే పప్పులు, గుడ్లు, మాంసం ఆహారాలు 14 నుంచి 15 శాతం ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అయితే గింజలు, నూనెగింజలు, పాలు, పాల ఉత్పత్తులు రోజుకు మొత్తం శక్తిలో 8-10% ఉండాలి. మీ రోజువారీ ఆహారంలో చక్కెర, ఉప్పు, కొవ్వును తగ్గించడానికి పండ్లతో పాటు.. కూరగాయలను ఎక్కువగా తినాలి. ముఖ్యంగా గర్భిణులు, పాలిచ్చే మహిళలు వీలైనంత ఎక్కువ పాలు, గుడ్లు, మాంసం తినాలని సూచించారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

సంక్రాంతికి సీనియర్స్ హవా.. ఎన్నాళ్లకెన్నాళ్లకు..!
సంక్రాంతికి సీనియర్స్ హవా.. ఎన్నాళ్లకెన్నాళ్లకు..!
ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థమది కాదు..ఎల్అండ్ టీ కంపెనీ హెచ్ఆర్.!
ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థమది కాదు..ఎల్అండ్ టీ కంపెనీ హెచ్ఆర్.!
చదివింది ఇంటర్.. హీరోయిన్‌గా ఇరగదీసింది..
చదివింది ఇంటర్.. హీరోయిన్‌గా ఇరగదీసింది..
కొత్తపేటలో వైభవంగా ప్రభల తీర్థం...ఆకట్టుకున్న బాణాసంచా కాల్పులు
కొత్తపేటలో వైభవంగా ప్రభల తీర్థం...ఆకట్టుకున్న బాణాసంచా కాల్పులు
వీరభద్రుడికి గుమ్మడికాయలు ఎందుకు సమర్పిస్తారో తెలుసా...?
వీరభద్రుడికి గుమ్మడికాయలు ఎందుకు సమర్పిస్తారో తెలుసా...?
డిఫరెంట్‌ లుక్‌లో ప్రభాస్‌.. డైలామాలో పడిన ఫ్యాన్స్‌
డిఫరెంట్‌ లుక్‌లో ప్రభాస్‌.. డైలామాలో పడిన ఫ్యాన్స్‌
పండగ పూట అంతులేని విషాదం.. ఒకేసారి అన్నదమ్ములిద్దరికీ గుండెపోటు!
పండగ పూట అంతులేని విషాదం.. ఒకేసారి అన్నదమ్ములిద్దరికీ గుండెపోటు!
గేమ్ ఛేంజర్‌పై శంకర్ సంచలన వ్యాఖ్యలు..!
గేమ్ ఛేంజర్‌పై శంకర్ సంచలన వ్యాఖ్యలు..!
ఓవర్‌సీస్‌లోనూ నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో జోరు చూపిస్తున్న బాలయ్య
ఓవర్‌సీస్‌లోనూ నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో జోరు చూపిస్తున్న బాలయ్య
ప్రపంచంలోనే భారత్‌ మూడో స్థానం.. అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌!
ప్రపంచంలోనే భారత్‌ మూడో స్థానం.. అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌!