Vinayaka Chavithi: పర్యావరణ హితం కోసం వినాయక విగ్రహాన్ని మట్టితోనే కాదు ఈ వస్తువులతో కూడా తయారు చేసుకోవచ్చు..

ఈ నేపధ్యంలో మట్టితో చేసిన పర్యావరణ అనుకూలమైన గణపతి విగ్రహం మీద ఎక్కువమంది ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ఇంట్లో కూడా పర్యావరణ అనుకూలమైన గణపతి విగ్రహాన్ని తయారు చేసుకోవచ్చు. మట్టి విగ్రహ తయారీ కోసం, పర్యావరణ అనుకూలమైన గణపతి విగ్రహాన్ని తయారు చేయడానికి ఒక కిట్ కూడా మార్కెట్ లో లభిస్తుంది. ఈ కిట్ ని ఉపయోగించి వినాయక విగ్రహాన్ని తయారు చేయవచ్చు.

Vinayaka Chavithi: పర్యావరణ హితం కోసం వినాయక విగ్రహాన్ని మట్టితోనే కాదు ఈ వస్తువులతో కూడా తయారు చేసుకోవచ్చు..
Eco Lord Ganesha
Follow us

|

Updated on: Sep 03, 2024 | 3:42 PM

ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహాన్ని ఇంటి వద్ద, బహిరంగ ప్రదేశాల్లో లేదా మండపాలలో ప్రతిష్టించి పూజిస్తారు. విగ్రహాన్ని 9 లేదా 10 రోజులు గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. భజన, కీర్తన సహా అనేక మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం 10 వ రోజు గణేశ విగ్రహాన్ని నదిలో లేదా చెరువులో నిమజ్జనం చేస్తారు. అయితే గతం కంటే ఇప్పుడు ప్రజల్లో పర్యావరణం గురించి అవగాహన పెరుగుతోంది. దీంతో ప్రజలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌కు బదులుగా మట్టి లేదా పర్యావరణ అనుకూల విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీటిని కలుషితం చేస్తుంది.

ఈ నేపధ్యంలో మట్టితో చేసిన పర్యావరణ అనుకూలమైన గణపతి విగ్రహం మీద ఎక్కువమంది ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ఇంట్లో కూడా పర్యావరణ అనుకూలమైన గణపతి విగ్రహాన్ని తయారు చేసుకోవచ్చు. మట్టి విగ్రహ తయారీ కోసం, పర్యావరణ అనుకూలమైన గణపతి విగ్రహాన్ని తయారు చేయడానికి ఒక కిట్ కూడా మార్కెట్ లో లభిస్తుంది. ఈ కిట్ ని ఉపయోగించి వినాయక విగ్రహాన్ని తయారు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆవు పేడ

ఆవు పేడతో చేసిన విగ్రహాలు పర్యావరణ అనుకూలమైనవి. అటువంటి పరిస్థితిలో మీరు కూడా వినాయక చవితి రోజున ఆవు పేడతో చేసిన వినాయక విగ్రహాన్ని కూడా ప్రతిష్టించవచ్చు.

పసుపు

వంటగదిలో లభించే పసుపుతో కూడా బొజ్జ గణపయ్య విగ్రహాన్ని తయారు చేయవచ్చు. ముందుగా పసుపును మెత్తగా పిండిగా చేసి ఆ తర్వాత ఆ పసుపుతో వినాయకుని విగ్రహాన్ని తయారు చేయండి

బియ్యం పిండి

ఇంట్లో లభించే బియ్యం పిండితో కూడా గణపతి విగ్రహాన్ని కూడా సిద్ధం చేసుకోవచ్చు. దీని కోసం పసుపు, బీట్‌రూట్‌లను జోడించి.. ఈ రెండింటిలో దేనినైనా రసంతో బియ్యంపిండి కలిపి.. ఆకులతో అలంకరించాలి.

సగ్గుబియ్యం

మట్టితో చేసిన లేదా ఇంటిలో పర్యావరణ అనుకూలమైన గణపతి విగ్రహాన్ని అలంకరించేందుకు సగ్గు బియ్యం, డ్రై ఫ్రూట్స్, బియ్యం, రంగురంగుల పప్పులు, ఆర్గానిక్ పెయింట్లను ఉపయోగించవచ్చు.

విగ్రహం తయారు చేసే విధానం

గణేశుని విగ్రహాన్ని తయారు చేయడానికి సాధారణ మట్టి, పసుపు లేదా పిండి వంటి ఏదైనా ఉపయోగించవచ్చు. అప్పుడు మట్టిని ముందుగా తడిపి మృదువుగా చేయండి. తర్వాత విగ్రహం తయారు చేయడం సులభం.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

విగ్రహాన్ని తయారు చేసే విధంగా పేస్ట్‌ను సిద్ధం చేయండి. ఇప్పుడు వినాయక విగ్రహానికి శరీరం, తల, వేళ్లు, వంటివి తయారు చేసి గణపతికి సరైన ఆకృతిని ఇవ్వండి. తర్వాత ఆ విగ్రహాన్ని ఆరబెట్టండి. అప్పుడు అందంగా విగ్రహాన్ని అలంకరించండి.చ

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..