Vastu Tips: ఇంటి ప్రధాన ద్వారం దగ్గర గణపతి బొమ్మను ఉంచితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే
హిందూ మతంలో గణేశుడికి మొదటి పూజ చేస్తారు. పండగైనా, శుభకార్యమైనా, ఏదైనా ఫంక్షన్ అయినా సరే మొదట బొజ్జ గణపయ్యను ప్రార్ధించి ఆ కార్యాన్ని మొదలు పెడతారు. ఎందుకంటే వినాయకుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా పనిని నిర్విఘనంగా జరిగేలా చేస్తాడని నమ్ముతారు. అందుకే ఇంట్లో ఏదైనా పని చేసే ముందు వినాయకుడిని ప్రార్థించడం, పూజించడం హిందూ సంప్రదాయం. అయితే కొంతమంది తమ ఇంటి ప్రధాన ద్వారానికి రకరకాల డిజైన్స్ ను ఏర్పాటు చేసుకుంటారు. కొందరు తలపులకు వినాయకుడి ఫోటో లేదా విగ్రహాన్ని పెట్టుకుంటారు. ఇలా చ చేయడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం