గణపతి నవరాత్రి ఉత్సవాల్లో రోజూ ఈ గణేశ స్తోత్రాన్ని పఠించండి.. జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి
ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్ల పక్షం చతుర్థి తిధి రోజున జరుపుకుంటారు. ఈ పండుగ సాధారణంగా ఆగస్టు లేదా సెప్టెంబర్ మధ్య వస్తుంది. ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలు సెప్టెంబర్ 7వ తేదీ శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వినాయక చవితి ఉత్సవాల్లో గణేశుడిని పూజించే సమయంలో గణేష్ స్తోత్రాన్ని పఠించడం వల్ల జీవితంలోని ప్రతి పనిలో విజయం లభిస్తుంది. జీవితంలో ఆనందం లభిస్తుంది. అన్ని కష్టాలు తొలగిపోతాయి.
వినాయక చవితి హిందూ మతంలో ముఖ్యమైన పండుగల్లో ఒకటి. ఈ పండుగను వినాయకుని జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. ఈ పండుగను భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో, ముఖ్యంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి ప్రాంతాల్లో వైభవంగా జరుపుకుంటారు. వినాయక చవితి రోజున వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించి పదిరోజుల పాటు పూజలు చేస్తారు. మరికొందరు ఇంట్లో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించి 3, 5, 7 లేదా 9 రోజులు పూజిస్తారు. మండపాలు ఏర్పాటు చేసి గణేశుడి విగ్రహాన్ని నవరాత్రి ఉత్సవాలను నిర్వహించి 10వ రోజు నదులు లేదా చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. పండుగ సందర్భంగా భజనలు, కీర్తనలు, నృత్యాలు ,ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పదవ రోజున వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు.
గణేశుడిని విఘ్నాలకధిపతి అని పిలుస్తారు.. అంటే అడ్డంకులను తొలగించేవాడు అని అర్ధం. కనుక ఈ పండుగ కొత్త పనిని ప్రారంభించడానికి పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ పండుగను ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్ల పక్షం చతుర్థి తిధి రోజున జరుపుకుంటారు. ఈ పండుగ సాధారణంగా ఆగస్టు లేదా సెప్టెంబర్ మధ్య వస్తుంది. ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలు సెప్టెంబర్ 7వ తేదీ శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వినాయక చవితి ఉత్సవాల్లో గణేశుడిని పూజించే సమయంలో గణేష్ స్తోత్రాన్ని పఠించడం వల్ల జీవితంలోని ప్రతి పనిలో విజయం లభిస్తుంది. జీవితంలో ఆనందం లభిస్తుంది. అన్ని కష్టాలు తొలగిపోతాయి.
గణేష్ స్తోత్ర పారాయణం (గణేష్ స్తోత్రం)
ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్, భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే.
ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్, తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్.
లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ, సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్.
నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్, ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్.
ద్వాదశ ఈతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః, న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికారకం ప్రభో !
విద్యార్థీ లభతే విద్యాం, దనార్థీ లభతే ధనమ్, పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్.
జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్, సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః.
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్, తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః
గణేష స్తోత్రం చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు
గణేశుడిని పూజించడం, గణేష స్తోత్రాలను చదవడం హిందూ మతంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. గణేశుడిని అడ్డంకులు తొలగించే దైవంగా పూజిస్తారు. కనుక గణపతి స్తోత్రాలను పఠించడం వల్ల అన్ని రకాల ఆటంకాలు తొలగిపోయి జీవితంలో విజయం చేకూరుతుందని నమ్ముతారు. గణేశుడి ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడిని దూరం అవుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.