Tirumala Laddu: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. స్వామిని దర్శించుకుంటే చాలు.. భక్తులకు అడిగినన్నీ లడ్డూలు

తిరుమల శ్రీవారి లడ్డూ జారీలో తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది. పవిత్రమైన లడ్డు ప్రసాదం భక్తుడికే అందేలా చర్యలు తీసుకుంది. ఆధార్ లింక్‌తో దుర్వినియోగం కాకుండా లడ్డుల పంపిణీలో మార్పులు తీసుకొచ్చింది.

Tirumala Laddu: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. స్వామిని దర్శించుకుంటే చాలు.. భక్తులకు అడిగినన్నీ లడ్డూలు
Tirumala Laddu
Follow us
Raju M P R

| Edited By: Balaraju Goud

Updated on: Sep 03, 2024 | 10:01 AM

తిరుమల శ్రీవారి లడ్డూ జారీలో తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది. పవిత్రమైన లడ్డు ప్రసాదం భక్తుడికే అందేలా చర్యలు తీసుకుంది. ఆధార్ లింక్‌తో దుర్వినియోగం కాకుండా లడ్డుల పంపిణీలో మార్పులు తీసుకొచ్చింది. దర్శనం చేసుకునే భక్తుడు సంతృప్తి చెందేలా లడ్డూలను విక్రయిస్తున్న టీటీడీ దళారీల చేతికందకుండా కట్టడి చేసింది. శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని కొనుగోలు శుభకార్యాల్లో స్టేటస్‌గా పంపిణీ చేస్తున్నవారికి కళ్ళెం వేసింది.

తిరుమల లడ్డు.. శ్రీవారి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైంది. వెంకన్న దర్శనం తర్వాత భక్తులు అంతటి ప్రాధాన్యతను ఇచ్చే లడ్డు ప్రసాదం ఈ మధ్య దళారీల చేతిలో దుర్వినియోగం అవుతున్నట్లు టీటీడీ గుర్తించింది. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలలో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా టీటీడీ పలు నిర్ణయాలను తీసుకుంటుంది. ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న టీటీడీ, దళారీ వ్యవస్థపై దృష్టి పెట్టింది.

శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు దళారులు చేతిలో మోసపోకుండా కొరడా జులిపిస్తున్న టీటీడీ, లడ్డూ ప్రసాదం పొందే భక్తులకు ఆధార్ కంపల్సరీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే శ్రీవారి లడ్డు ప్రసాదం అదనంగా పొందే భక్తులు ఆధార్ కార్డు సమర్పించాలన్న నిబంధన తీసుకొచ్చింది. గతంలో శ్రీవారి భక్తులు అడిగినన్ని లడ్డూలు ఇస్తున్న టీటీడీ దళారీ వ్యవస్థ కొనసాగుతుందని, పవిత్రమైన లడ్డు ప్రసాదం దుర్వినియోగం అవుతోందని గుర్తించే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తోంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం మిస్ యూజ్ అవుతుందని భావించి టీటీడీ తాజా నిర్ణయాన్ని తీసుకొచ్చింది.

శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాలు అందజేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్న టీటీడీ పాలకమండలి, దళారుల బెడదను అంతం కోసం తీసుకున్న నిర్ణయమంటోంది. దర్శనం టోకెన్లు లేని భక్తులకు ఆధార్ తో లడ్డూ ప్రసాదం జారీ చేస్తోంది. లడ్డు ప్రసాదం పంపిణీ పై నిరాధార ఆరోపణలను భక్తులు నమ్మవద్దని టీటీడీ చెబుతోంది. సామాన్య భక్తుల ప్రయోజనాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్ననంటున్న టీటీడీ పేర్కొంది. దర్శనం టోకెన్లు లేని భక్తులు లడ్డూ కౌంటర్లలో తమ ఆధార్ కార్డును నమోదు చేసుకుని రెండు లడ్డూలు పొందవచ్చని స్పష్టం చేస్తోంది.

ఇందుకోసం లడ్డూ కాంప్లెక్స్ లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసిన టీటీడీ, 48 నుండి 62 నెంబర్ల కౌంటర్లలో భక్తులు లడ్డూలు పొందేందుకు అవకాశం కల్పించింది. కొందరు దళారులు లడ్డూలను కొనుగోలు చేసి, భక్తులకు అధిక ధరల కట్టబెట్టినట్లు టీటీడీ గుర్తించి అరికట్టేందుకు టోకెన్ లేని భక్తులకు ఆధార్ పై రెండు లడ్డూలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. భక్తులు కూడా ఇందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తుంది టీటీడీ పాలక మండలి.

ఇక శ్రీవారి లడ్డు ప్రసాదానికి ఆధార్ లింక్ చేయడంపై వస్తున్న విమర్శలపై ఈఓ శ్యామల రావు ఆరా తీశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా గత రెండున్నర నెలల్లో పలు మార్పులు తీసుకొచ్చామని అందులో భాగంగానే లడ్డు ప్రసాదం దళారులకు అందకుండా చర్యలు చేపట్టామన్నారు. దళారీ వ్యవస్థను అరికట్టేందుకే లడ్డు జారీ విధానంలో మార్పులు చేశామన్నారు. పలు చోట్ల వివాహాల్లో కూడా శ్రీవారి లడ్డులను పంపిణీ చేస్తున్నారని, స్వామివారి లడ్డు ప్రసాదాన్ని పంచడం కొందరు స్టేటస్ గా భావిస్తున్నారన్నారు ఈఓ శ్యామల రావు. ప్రతిరోజూ 3.5 లక్షల లడ్డులను భక్తులకు విక్రయిస్తుంటే దర్శనం టోకెన్ లేని భక్తులే లక్ష లడ్డులను పొందుతున్నారన్నారు. లడ్డు పంపిణీ పై కొందరు పని గట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారన్నారని మండిపడ్డారు.

దర్శనం చేసుకున్న భక్తులకు ఆధార్ కార్డుతో పని లేకుండా ఎన్ని లడ్డులైనా ఇస్తున్నామని ఈవో శ్యామలరావు అన్నారు. దర్శనం టికెట్ లేని భక్తులకు ఆధార్ కార్డుపై కేవలం రెండు లడ్డులను మాత్రమే ఇస్తామన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న టీటీడీ సమాచార కేంద్రాల్లో కూడా లడ్డులను భక్తులకు విక్రయిస్తున్నామన్నారు. సమాచార కేంద్రాల నుంచి కూడా లడ్డులకు భారీగా డిమాండ్ ఉందన్నారు ఈవో. టీడీలోని పలువురు అవుట్ సోర్సింగ్ సిబ్బంది కూడా లడ్డుల బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడారని, లడ్డులని అక్రమంగా విక్రయించిన వారిపై విచారణ జరుపుతున్నామన్నారు. త్వరలోనే లడ్డు దళారీలపై చర్యలు తీసుకుంటామన్న ఈఓ ముడి సరుకుల ధరలు పెరగడంతో లడ్డు ధర కూడా కొంతమేర పెరిగిందంటున్నారు. లడ్డు పంపిణీలో మార్పులు చేసిన తరువాత దళారీలను అరికట్టామంటున్నారు టిటిడి ఈవో శ్యామలరావు.

శ్రీవారి లడ్డు ప్రసాదం జారీలో టీటీడీ పారిదర్శకత ను స్వాగతిస్తున్న భక్తులు, ఇది సరైన నిర్ణయమేనంటున్నారు. కొందరు శ్రీవారి ప్రసాదాన్ని శుభకార్యాల్లో పంచడం సరికాదని, పవిత్రత దెబ్బతింటుందని భక్తులు వాపోతున్నారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు మాత్రమే లడ్డు ప్రసాదం అందజేయాలంటున్నారు శ్రీవారి భక్తులు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..