Vastu Tips: దక్షిణ దిశలో ఇల్లు ఉందా.. వాస్తు లోపాన్ని ఈ సింపుల్ టిప్స్ తో నివారించుకోండి..

జీవితంలో ఇల్లు కట్టుకోవడం ఒక్కసారే జరుగుతుంది. అందువల్ల ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటిని తన అభిరుచికి తగిన విధంగా నిర్మించుకోవడమే కాదు.. అవసరమైన అన్ని వస్తువులను కలిగి ఉండేలా చూసుకుంటాడు. ఇల్లు బాగా నిర్మించుకుంటాడు. అయితే ఒకోక్కసారి ఇంటి నిర్మాణంలో కొంత లోపం ఉంటుంది. అలాంటి లోపాలను అధిగమించడానికి వాస్తు శాస్త్రంలో చాలా విషయాలు ప్రస్తావించబడ్డాయి.

Vastu Tips: దక్షిణ దిశలో ఇల్లు ఉందా.. వాస్తు లోపాన్ని ఈ సింపుల్ టిప్స్ తో నివారించుకోండి..
Vastu Tips For Home
Follow us

|

Updated on: Sep 02, 2024 | 8:37 PM

ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు నిర్మించుకోవాలనేది ఒక కల. కొంతమంది తాము కన్న కల నెరవేర్చుకుంటారు. అదే సమయంలో కొంత మందికి మాత్రం సొంత ఇంటి కోరిక ఎప్పుడూ నెరవేరదు. ద్రవ్యోల్బణం కాలంలో సామాన్యుడికి ఇల్లు కట్టడం అంత తేలికైన పని కాదు. కనుక జీవితంలో ఇల్లు కట్టుకోవడం ఒక్కసారే జరుగుతుంది. అందువల్ల ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటిని తన అభిరుచికి తగిన విధంగా నిర్మించుకోవడమే కాదు.. అవసరమైన అన్ని వస్తువులను కలిగి ఉండేలా చూసుకుంటాడు. ఇల్లు బాగా నిర్మించుకుంటాడు. అయితే ఒకోక్కసారి ఇంటి నిర్మాణంలో కొంత లోపం ఉంటుంది. అలాంటి లోపాలను అధిగమించడానికి వాస్తు శాస్త్రంలో చాలా విషయాలు ప్రస్తావించబడ్డాయి.

ఇల్లు దక్షిణ దిశలో ఎందుకు ఉండకూడదు?

వాస్తులో డైరెక్షన్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందుచేత ఇల్లు కట్టే సమయంలో ఇల్లు దక్షిణం వైపు ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే దక్షిణ దిశలో ఇల్లు నిర్మిస్తే ఆ ఇంట్లో ఎప్పుడూ ప్రతికూలత వ్యాపిస్తుంది. ఈ దిక్కు యమరాజు దిక్కు కనుక ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ ఆ దిక్కున ఎప్పుడూ ఉండకూడదు. ఇంటిని నిర్మించే సమయంలో ఇల్లు ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉండాలని గుర్తుంచుకోండి. ఈ దిశలో ఇంటి నిర్మాణం సానుకూల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. సమస్యలు తొలగిపోతాయి.

ఎలాంటి చర్యలు అవసరం?

ఇల్లు దక్షిణ దిశ వైపు ఉంటే భయాందోళనలు పడే బదులుగా కొన్ని వాస్తు నియమాలను పాటించడం ప్రారంభించండి. దీని కారణంగా క్రమంగా అన్ని కష్టాలు తొలగిపోతాయి. వ్యక్తిగత జీవితం ఒక ట్రాక్ లో పడుతుంది.

ఇవి కూడా చదవండి

నిచ్చెన లేదా మెట్ల నిర్మాణం:

ఎవరి ఇంటి ద్వారం దక్షిణ దిశ వైపు ఉంటే.. ద్వారం దగ్గర మెట్లు నిర్మించండి. అలా మెట్లు నిర్మించడం సాధ్యం కాకపోతే ప్రధాన ద్వారం వద్ద 2-3 మెట్లు ఏర్పాటు చేసుకోండి. ఇలా చేయడం వలన ఇంట్లో వచ్చే అడ్డంకులను ఆపివేస్తుందని.. వాస్తు ప్రభావం కూడా తగ్గుతుందని నమ్మకం.

వేప మొక్కను నాటండి:

దక్షిణ దిశలో దోషాన్ని తొలగించడానికి అనేక శుభ పరిహారాలు సూచించబడ్డాయి. ఇంటి ప్రవేశద్వారం వద్ద వేప మొక్కను నాటినా అది కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది.

అద్దం ఏర్పాటు:

ఇంటికి దక్షిణ దిశలో అద్దం పెట్టడం కూడా మేలు చేస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం దక్షిణంలో ఉంటే దక్షిణం వైపు అద్దం పెడితే మేలు జరుగుతుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. దీని కారణంగా ప్రతికూల శక్తులు అద్దానికి ఢీకొని తిరిగి రిఫెక్లేట్ అవుతాయని నమ్మకం.

దేవుని విగ్రహాన్ని ప్రతిష్టించండి:

దక్షిణ దిశ ప్రతికూలతకు మూలంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో ఇల్లు దక్షిణ దిశలో ఉంటే ఆ దిశలో దేవుని విగ్రహాన్ని ఉంచండి లేదా గోడపై గణేశుడి బొమ్మను ఉంచండి. ఇది కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అంతేకాదు హనుమంతుడి చిత్రాన్ని కూడా ఉంచవచ్చు. దీని ప్రభావం కారణంగా దుష్ట శక్తులు పారిపోతాయి. వ్యక్తిగత జీవితంలో ఉపశమనం పొందుతాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.

రుద్రప్రయాగ్ లో చిక్కున్న దాదాపు 40 మంది తెలుగు భక్తులు..
రుద్రప్రయాగ్ లో చిక్కున్న దాదాపు 40 మంది తెలుగు భక్తులు..
ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తే లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తే లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
ఎన్‌సీసీ డ్రెస్‌లోని ఈకుర్రాడిని గుర్తు పట్టారా? పాన్ ఇండియా హీరో
ఎన్‌సీసీ డ్రెస్‌లోని ఈకుర్రాడిని గుర్తు పట్టారా? పాన్ ఇండియా హీరో
ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు తొలగింపు
ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు తొలగింపు
డిసెంబర్ నెల దర్శన కోటా రిలీజ్.. టిక్కెట్లను బుక్ చేసుకోండి ఇలా..
డిసెంబర్ నెల దర్శన కోటా రిలీజ్.. టిక్కెట్లను బుక్ చేసుకోండి ఇలా..
హుషారు సినిమాబ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
హుషారు సినిమాబ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
చంద్రబాబు సర్కార్‌కు 100 రోజులు.. ఇవాళ కేబినెట్ కీలక భేటీ..
చంద్రబాబు సర్కార్‌కు 100 రోజులు.. ఇవాళ కేబినెట్ కీలక భేటీ..
మయన్మార్‌లో యాగీ బీభత్సం.. 21టన్నుల రిలీఫ్ మెటీరియల్‌ పంపిన భారత్
మయన్మార్‌లో యాగీ బీభత్సం.. 21టన్నుల రిలీఫ్ మెటీరియల్‌ పంపిన భారత్
10th పరీక్షలపై ఏపీ సర్కార్‌ కీలక ప్రకటన.. విద్యార్ధుల్లో అయోమయం
10th పరీక్షలపై ఏపీ సర్కార్‌ కీలక ప్రకటన.. విద్యార్ధుల్లో అయోమయం
దసరా నవరాత్రులకు ముస్తాబవుతోన్న ఇంద్రకీలాద్రి..
దసరా నవరాత్రులకు ముస్తాబవుతోన్న ఇంద్రకీలాద్రి..