Rainy Season Travel Tips: వర్షాకాలంలో కూడా వైష్ణో దేవి టెంపుల్ కి వెళ్తున్నారా.. ఈ విషయాలు గుర్తుంచుకోండి

వాస్తవానికి వర్షాకాలంలో నేలలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా పర్వతాలలో కొండచరియలు విరిగిపడటం సర్వసాధారణం. కనుక మీరు వర్షాకాలంలో వైష్ణో దేవి ఆలయం దగ్గరకు లేదా ఏదైనా కొండ ప్రాంతాలకు వెళ్తుంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. వర్షాకాలంలో ఏదైనా కొండ ప్రాంతాలకు వెళ్తుంటే మరింత జాగ్రత్తగా ఉండాలి.. లేకుంటే ఈ సీజన్‌లో కొండల మీద రోడ్లకు పగుళ్లు ఏర్పడి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వర్షాకాలంలో కొండ ప్రాంతాలకు వెళ్తుంటే ఏయే విషయాలను గుర్తుంచుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం..

Rainy Season Travel Tips: వర్షాకాలంలో కూడా వైష్ణో దేవి టెంపుల్ కి వెళ్తున్నారా.. ఈ విషయాలు గుర్తుంచుకోండి
Vaishno Devi TempleImage Credit source: lucky_singhanaiiii/insta
Follow us

|

Updated on: Sep 03, 2024 | 3:13 PM

కత్రాలోని పర్వతాల మధ్య ఉన్న వైష్ణో దేవి ఆలయం హిందువుల విశ్వాసానికి కేంద్రంగా ఉంది. మాతా వైష్ణో దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సెప్టెంబరు నెల ప్రారంభమైనప్పటికీ నుంచి చాలా ప్రాంతాలల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో జమ్ము కష్మీర్ లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. కత్రా వైష్ణోదేవి రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. సమాచారం ప్రకారం, మాతా వైష్ణో దేవి భవన్ రోడ్డులోని పంచి హెలిప్యాడ్ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. వాస్తవానికి వర్షాకాలంలో నేలలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా పర్వతాలలో కొండచరియలు విరిగిపడటం సర్వసాధారణం. కనుక మీరు వర్షాకాలంలో వైష్ణో దేవి ఆలయం దగ్గరకు లేదా ఏదైనా కొండ ప్రాంతాలకు వెళ్తుంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. వర్షాకాలంలో ఏదైనా కొండ ప్రాంతాలకు వెళ్తుంటే మరింత జాగ్రత్తగా ఉండాలి.. లేకుంటే ఈ సీజన్‌లో కొండల మీద రోడ్లకు పగుళ్లు ఏర్పడి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వర్షాకాలంలో కొండ ప్రాంతాలకు వెళ్తుంటే ఏయే విషయాలను గుర్తుంచుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం..

వాతావరణం గురించి ముందుగానే సమాచారాన్ని తెలుసుకోండి

మీరు ఏదైనా ప్రదేశానికి విహారయాత్రను ప్లాన్ చేస్తుంటే.. ముఖ్యంగా వర్షాకాలంలో కొండ ప్రాంతాలకు వెళుతున్నట్లయితే.. వాతావరణం గురించి ముందుగానే సమాచారాన్ని పొందడం చాలా ముఖ్యం. భారీ వర్షం కురిసే అవకాశం ఉంటే కొండలు ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలి.

ఇవి కూడా చదవండి

ప్రయాణం ప్రారంభించే ముందు ఈ పనులు చేయండి

గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత ముందుగా అక్కడ ఉన్న అధికారుల నుండి విపత్తు నిర్వహణ గురించి సమాచారాన్ని పొందండి లేదా ఆన్‌లైన్ హెల్ప్‌లైన్ నంబర్‌లను మీ వద్ద ఉంచుకోండి, తద్వారా అత్యవసర పరిస్థితుల్లో మీరు తక్షణ సహాయం పొందవచ్చు.

ఫోటోలు తీస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి

ప్రతి ఒక్కరూ కొండ ప్రాంతాలలో ఫోటోలు తీయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ప్రకృతి అందాలు భిన్నంగా ఉంటాయి. అయితే ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రుతుపవనాలు సీజన్ అయితే కొండ ప్రాంతాలలో జారిపోయే అవకాశం చాలా ఉంది. కనుక ఫోటోలు తీసుకునే సమయంలో ఒకరి ఫోటోలను ఫోటోలను తీసుకోవాలి. అంతేకాదు అదనపు సంరక్షణ తీసుకోవాలి.

హోటల్‌లో బస చేసేటప్పుడు జాగ్రత్తగా

వర్షాకాలంలో పర్వత ప్రాంతాలకు యాత్రకు వెళ్తే.. లేదా అక్కడ వాతావరణం అకస్మాత్తుగా మారిపోయినట్లు అనిపిస్తే.. బస చేసేటప్పుడు.. ఏదైనా నది లేదా పర్వత ప్రాంతం దగ్గరగా హోటల్ ను తీసుకోవద్దు. ఇలా చిన్న చిన్న విషయాలను దృష్టిలో పెట్టుకుని చాలా వరకు సురక్షితంగా ప్రయాణించవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్త కోసం క్లిక్‌ చేయండి..