IRCTC: తక్కువ ఖర్చు.. ఎక్కువ ఆనందం.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీలు ఇవే..

కానీ అలాంటి ఇబ్బంది లేకుండా ఐఆర్ సీటీసీ అందిస్తున్న టూర్ ప్యాకేజీలను బుక్ చేసుకుని తక్కువ ఖర్చుతో మీకు నచ్చిన ప్రదేశాలను ఆనందంగా సందర్శించవచ్చు. ఐఆర్ సీటీసీలో సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య అందుబాటులో ఉన్న టూర్ ప్యాకేజీల గురించి తెలుసుకుందాం.

IRCTC: తక్కువ ఖర్చు.. ఎక్కువ ఆనందం.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీలు ఇవే..
Irctc Tour Packages
Follow us

|

Updated on: Sep 03, 2024 | 3:23 PM

వివిధ ప్రాంతాలలో పర్యటించి, అక్కడి పరిస్థితులు, ప్రజల జీవన విధానం, చారిత్రక కట్టడాలు, ప్రముఖ ఆలయాల గురించి తెలుసుకోవాలని చాలా అందరికీ ఆసక్తి ఉంటుంది. కానీ ఎలా వెళ్లాలో, ఆయా ప్రాంతాలలో ఎలా తిరిగాలో తెలియక వెనుకంజ వేస్తారు. అలాంటి వారికి టూర్ ప్యాకేజీలు చాలా ఉపయోగంగా ఉంటాయి. ఈ విధానంలో ఎక్కువమందిని టూర్ కు తీసుకువెళ్లి, అన్ని ప్రదేశాలను చూపిస్తారు. అనేక మందితో కలిసి ఉండడం వల్ల పర్యటనను ఆస్వాదించవచ్చు. వివిధ వ్యక్తులతో కలిసి ఉండడం వల్ల కొత్త విషయాలను తెలుసుకోవచ్చు. అయితే దీనికి డబ్బులు ఎక్కువ ఖర్చుతాయా అనే ప్రశ్న తలెత్తుతుంది. కానీ అలాంటి ఇబ్బంది లేకుండా ఐఆర్ సీటీసీ అందిస్తున్న టూర్ ప్యాకేజీలను బుక్ చేసుకుని తక్కువ ఖర్చుతో మీకు నచ్చిన ప్రదేశాలను ఆనందంగా సందర్శించవచ్చు. ఐఆర్ సీటీసీలో సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య అందుబాటులో ఉన్న టూర్ ప్యాకేజీల గురించి తెలుసుకుందాం.

తక్కువ బడ్జెట్..

ఐఆర్ సీటీసీ టూర్ ప్యాకేజీల ద్వారా రైళ్లలో వివిధ ప్రదేశాలను సందర్శించవచ్చు. తక్కువ బడ్జెట్ తో అనేక ప్రాంతాలలో పర్యటించవచ్చు. ప్రయాణ ఏర్పాట్లన్నీ ముందుగానే తయారు చేయబడినందున సమయం ఆదా అవుతుంది. హోటళ్లు, వివిధ ప్రదేశాల పూర్తి సమాచారం ముందుగానే ఇవ్వబడుతుంది. అలాగే టూర్ ప్యాకేజీతో ప్రయాణం చేస్తే మీకు మంచి ఆఫర్లు కూడా లభిస్తాయి. ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకూ ఉన్న టూర్ ప్యాకేజీ వివరాలు ఇలా ఉన్నాయి.

సెప్టెంబర్‌లో..

  • లక్నో నుంచి సిమ్లాకుఫ్రీ టూర్ ప్యాకేజీ – సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభమవుతుంది.
  • చండీగఢ్ నుంచి గుల్మార్గ్, పహల్గామ్, సోన్‌మార్గ్, శ్రీనగర్ టూర్ ప్యాకేజీ (సెప్టెంబర్ 7)
  • జైపూర్ నుంచి మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, త్రివేండ్రం, కుమరకోమ్, మున్నార్, కొచ్చి (సెప్టెంబర్ 9)
  • ఢిల్లీ నుంచి లడఖ్-లేహ్ టూర్ ప్యాకేజీ ( సెప్టెంబర్ 14)
  • చెన్నై, ఢిల్లీ నుంచి బద్రీనాథ్, గంగోత్రి, కేదార్‌నాథ్, యమునోత్రి టూర్ ప్యాకేజీ (సెప్టెంబర్ 15)
  • హైదరాబాద్ నుంచి వారణాసి- ప్రయాగ్‌రాజ్ టూర్ ప్యాకేజీ (సెప్టెంబర్ 22)
  • హైదరాబాద్ నుంచి జైపూర్/జోద్ పూర్/పుష్కర్/ఉదయ్ పూర్ (సెప్టెంబర్ 23)

అక్టోబర్‌లో..

  • బిలాస్‌పూర్, రాయ్‌పూర్ నుంచి జైపూర్-ఖతుశ్యాంజీ టూర్ ప్యాకేజీ (అక్టోబర్ 10)
  • కొచ్చి నుంచి సిమ్లా- మనాలి (అక్టోబర్ 14)
  • చెన్నై నుంచి శ్రీనగర్, గుల్మార్గ్, సోన్‌మార్గ్, పహల్గాం (అక్టోబర్ 19)
  • హైదరాబాద్ నుంచి హేవ్‌లాక్-పోర్ట్ బ్లెయిర్ (అక్టోబర్ 18)
  • హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్, భావ్‌నగర్, ద్వారకా టూర్ ప్యాకేజీ (అక్టోబర్ 16)

నవంబర్‌లో..

  • హైదరాబాద్ నుంచి మహేశ్వర్, ఓంకారేశ్వర్, ఉజ్జయిని, ఇండోర్ (నవంబర్ 6)
  • చెన్నై నుంచి తిరువనంతపురం (నవంబర్ 14)
  • చండీగఢ్ నుంచి లక్నో- అయోధ్య (నవంబర్ 8)
  • తిరుచ్చి, మండపం నుంచి అయోధ్య, పోఖారా, ముక్తినాథ్, ఖాట్మండు (నవంబర్ 11)
  • ముంబై నుంచి డార్జిలింగ్, గ్యాంగ్‌టక్, కాలింపాంగ్ (నవంబర్ 16)

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేసిన దేవర|అసలు ఏది నమ్మాలి?
రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేసిన దేవర|అసలు ఏది నమ్మాలి?
వెంకన్న భక్తులకు అన్నప్రసాదం ఆ దాతల చలువే.. దాతలకు ఘన సన్మానం
వెంకన్న భక్తులకు అన్నప్రసాదం ఆ దాతల చలువే.. దాతలకు ఘన సన్మానం
మంకీపాక్స్ అలర్ట్.. దేశంలో మరో అనుమానిత కేసు..
మంకీపాక్స్ అలర్ట్.. దేశంలో మరో అనుమానిత కేసు..
సెల్ఫ్ నామినేషన్ దెబ్బ.. డేంజర్‌ జోన్‌లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్
సెల్ఫ్ నామినేషన్ దెబ్బ.. డేంజర్‌ జోన్‌లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్
16 పరుగులకే 5 వికెట్లు.. ద్వీవుల్లో డైనమేట్ బీభత్సం..
16 పరుగులకే 5 వికెట్లు.. ద్వీవుల్లో డైనమేట్ బీభత్సం..
రుద్రప్రయాగ్ లో చిక్కున్న దాదాపు 40 మంది తెలుగు భక్తులు..
రుద్రప్రయాగ్ లో చిక్కున్న దాదాపు 40 మంది తెలుగు భక్తులు..
ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తే లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తే లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
ఎన్‌సీసీ డ్రెస్‌లోని ఈకుర్రాడిని గుర్తు పట్టారా? పాన్ ఇండియా హీరో
ఎన్‌సీసీ డ్రెస్‌లోని ఈకుర్రాడిని గుర్తు పట్టారా? పాన్ ఇండియా హీరో
ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు తొలగింపు
ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు తొలగింపు
డిసెంబర్ నెల దర్శన కోటా రిలీజ్.. టిక్కెట్లను బుక్ చేసుకోండి ఇలా..
డిసెంబర్ నెల దర్శన కోటా రిలీజ్.. టిక్కెట్లను బుక్ చేసుకోండి ఇలా..