Revanth Reddy: శభాష్ పోలీసన్న.. పలువురు అధికారులను ప్రశంసించిన సీఎం రేవంత్ రెడ్డి..

మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో వరదలు పొటెత్తాయి. దీంతో అధికారులు, పోలీసులు పగలు రాత్రి అని తేడా లేకుండా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రజలకు అవసరమైన సహాయం చేస్తూ.. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు..

Revanth Reddy: శభాష్ పోలీసన్న.. పలువురు అధికారులను ప్రశంసించిన సీఎం రేవంత్ రెడ్డి..
Cm Revanth Reddy
Follow us

|

Updated on: Sep 03, 2024 | 7:43 PM

మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో వరదలు పొటెత్తాయి. దీంతో అధికారులు, పోలీసులు పగలు రాత్రి అని తేడా లేకుండా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రజలకు అవసరమైన సహాయం చేస్తూ.. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతారాం తండాలో వరదల్లో చిక్కుకున్న 40 కుటుంబాలను పోలీసులు కాపాడారు.. వారిని సకాలంలో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.. అంతేకాకుండా.. చాలా మందికి ఆహారం సమకూర్చారు.. దీంతో మహబూబాబాద్ జిల్లాలోని పోలీస్ అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సన్మానించి ప్రశంసించారు. మహబూబాబాద్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులను అభినందించారు

సీతారాం తండాలో వరదల్లో చిక్కుకున్న వారిని ప్రజలను ఒడ్డుకు చేర్చడంలో కీలక భూమిక నిర్వహించిన మహబూబాబాద్ జిల్లాలోని సిరోల్ ఎస్.ఐ సిహెచ్ నగేష్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.. ఈ సందర్భంగా శాలువా కప్పి సన్మానించారు. సహాయక చర్యల్లో ప్రధాన పాత్ర వహించిన పోలీసులను రేవంత్ రెడ్డి ప్రశంసించారు.

అనంతరం, వరద నీటితో కేసముద్రం ఇంటికన్నె వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో కేసముద్రం, మహబూబాబాద్ టౌన్ రైల్వేస్టేషన్ లొ రైలు నిలిచిపోయి ప్యాసెంజర్లు ఇబ్బంది పడకుండా తినడానికి ఆహారంతో పాటు వాటర్ బాటిల్స్, బిస్కెట్ పాకెట్స్ సమకూర్చిన సీఐలను ముఖ్యమంత్రి సన్మానించారు. రైల్వే స్టేషన్ లో ఉన్న 5300 మంది ప్రయాణికులను కాజిపేటకు తరలించిన రూరల్ సీఐ సరవయ్య, టౌన్ సీఐ దేవేందర్ లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానించారు.

డిజిపి ప్రశంసలు..

భారీ వర్షాల్లో ఇబ్బందులు పడ్డ బాధితులను ఆదుకునేలా చర్యలు చేపట్టిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ను, రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి సన్మానం అందుకున్న ఎస్ఐ నగేష్ సిఐలు సర్వయ్య, దేవేందర్ లను డిజిపి డాక్టర్ జితేందర్, శాంతి భద్రతల అడిషనల్ డిజిపి మహేష్ ఎం భగవత్ ప్రశంసించారు. విధి నిర్వహణలో పలువురికి ఆదర్శంగా నిలిచారని వారిని కొనియాడారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..