Balakrishna: ‘మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను’.. తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు బాలయ్య భారీ విరాళం

రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులను ఆదుకునేందుకు బడా వ్యాపారవేత్తలు, రాజకీయ, సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. టాలీవుడ్ నుంచి కూడా ఇప్పటికే ఎన్టీఆర్, విశ్వక్ సేన్, సిద్దూ జొన్నల గడ్డ, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితర ప్రముఖులు వరద సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు. తాజాగా ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి..

Balakrishna: 'మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను'.. తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు బాలయ్య భారీ విరాళం
Balakrishna
Follow us

|

Updated on: Sep 03, 2024 | 7:03 PM

గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులై రోడ్డున పడ్డారు. ముఖ్యంగా విజయవాడలో వరద ఉధృతి ఇంకా తగ్గలేదు. ఇళ్లన్నీ నీటి దిగ్భంధంలో చిక్కుకున్నాయి. ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపడుతున్నా వరద తీవ్రత ఎక్కువగా ఉండడంతో చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులను ఆదుకునేందుకు బడా వ్యాపారవేత్తలు, రాజకీయ, సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. టాలీవుడ్ నుంచి కూడా ఇప్పటికే ఎన్టీఆర్, విశ్వక్ సేన్, సిద్దూ జొన్నల గడ్డ, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితర ప్రముఖులు వరద సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు. తాజాగా ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు రెండు రాష్ట్రాలలో మళ్లీ అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ ఒక భావోద్వేగ ప్రకటనను విడుదల చేశారు బాలయ్య.

’50 ఏళ్ళ క్రితం మా నాన్నగారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది.. 50 ఏళ్ల నుంచి నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది. వెలుగుతూనే ఉంది. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది.. ఈ రుణం ఎప్పటికీ తీరనిది. ఈ జన్మ మీకోసం.. మీ ఆనందం కోసం. నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోంది. ఈ విపత్కర పరిస్థితులలో బాధాతప్త హృదయంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు., తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు నా బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నాను. రెండు రాష్ట్రాలలో మళ్ళీ అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని ఎమోషనల్ అయ్యారు బాలకృష్ణ.

ఇవి కూడా చదవండి

ఈ జన్మ మీకోసం.. మీ ఆనందం కోసం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.