Viswam Movie: కడుపుబ్బా నవ్విస్తోన్న గోపిచంద్ ‘విశ్వం’ టీజర్.. శ్రీనువైట్ల మార్క్ కామెడీ అదిరింది..
ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ టీజర్ విడుదల చేశారు.
టాలీవుడ్ హీరో గోపిచంద్ హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం రామబాణం సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన ఈ హీరో.. ఇప్పుడు విశ్వం మూవీతో మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం గోపిచంద్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ మూవీ విశ్వం. డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కావ్యా థాపర్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ టీజర్ విడుదల చేశారు.
తాజాగా విడుదలైన టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. టీజర్ చూస్తుంటే రొటీన్ స్టోరీగా అనిపిస్తున్నా.. కామెడీ మాత్రం ఓ రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గోపిచంద్, నరేష్, వెన్నెల కిశోర్ డైలాగ్స్, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను అలరించడం ఖాయంగా తెలుస్తోంది. “మీరు ఫైట్ చేసిన స్టై్ల్ ను బట్టి చూస్తే మీకు మార్షల్ ఆర్ట్స్ బాగా తెలిసినట్లుగా ఉంది అనగా.. నాకు గీతా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప మరే ఆర్ట్స్ తెలియదు ” అంటూ వచ్చే డైలాగ్ నవ్వులు పండించింది. ఇక ఈసారి విశ్వం సినిమాలో డైరెక్టర్ శ్రీనువైట్ల మార్క్ కామెడీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా తీసుకువస్తున్నారు.
గతంలో శ్రీనువైట్ల తెరకెక్కించిన వెంకీ, దుబాయ్ శీను, ఢీ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాల్లోని కామెడీతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు శ్రీనువైట్ల. చాలా కాలంపాటు గ్యాప్ తీసుకుని ఇప్పుడు విశ్వం సినిమాతో మరోసారి ప్రేక్షకులను నవ్వించేందుకు రెడీ అయ్యాడు.
గోపిచంద్ విశ్వం మూవీ టీజర్ చూడండి..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.