AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌ నగర వీధుల్లో పరుగులు తీస్తున్న ఖరీదైన చేపలు.. వానకు ఊరే చెరువైంది!

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. రోడ్ల మీద వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేశాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే వరద నీరు ఉప్పొంగి ప్రజలు ఇళ్లలోకి చొచ్చుకొచ్చాయి. దీంతో ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకోవల్సిన దుస్థితి నెలకొంది. ఇక చినుకు పడితేనే..

Hyderabad: హైదరాబాద్‌ నగర వీధుల్లో పరుగులు తీస్తున్న ఖరీదైన చేపలు.. వానకు ఊరే చెరువైంది!
Fish On Waterlogged Roads
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Sep 05, 2024 | 3:22 PM

Share

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 3: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. రోడ్ల మీద వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేశాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే వరద నీరు ఉప్పొంగి ప్రజలు ఇళ్లలోకి చొచ్చుకొచ్చాయి. దీంతో ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకోవల్సిన దుస్థితి నెలకొంది. ఇక చినుకు పడితేనే చిత్తడిగా మారే హైదరాబాద్ లాంటి మహా నగరాన్ని ఇలాంటి భారీ వర్షాల సమయంలో ఊహించగలమా?

ఎడతెరిపి లేని వర్షాలు భాగ్యనగర వాసులను ముప్పతిప్పలు పెడుతున్నాయి. కాలనీలు జలమయమై, రోడ్లపై వరద నీరు పొంగిపొర్లుతుంది. ముఖ్యంగా వరద నీటి ఉధృతికి ఉస్మాన్ నగర్ పరివాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అనేక చోట్ల భారీ వృక్షాలు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. అయితే.. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉస్మాన్ నగర్ ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు రావడంతో ఈ ప్రాంతంలో రంగారెడ్డి కలెక్టర్ శశాంక్, ఇతర ఉన్నత అధికారులు ఆకస్మిక పర్యటన చేపట్టారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని జలపల్లి మున్సిపాలిటీ, ఉస్మాన్ నగర్ లోతట్టు ప్రాంత పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఈ క్రమంలో రోడ్లపై నిలిచిపోయిన నీటిలో సుమారు మూడు నుంచి ఐదు కిలోల బరువుండే చేపలను చూసి అధికారులు అవాక్కయ్యారు.

ఇవి కూడా చదవండి

పాతబస్తీ గల్లీలో వరద నీరు భారీగా చేరుకోవడంతో ఆ నీటిలో కొర్రమట్ట చేపలు తిరుగుతున్నాయి. చెరువు దగ్గరికే మనం వెళ్లామా? లేక మన దగ్గరికే చెరువుల్లో చేపలు వచ్చి చేరాయా అన్న చందంగా మారింది అక్కడి పరిస్థితి. జనావాసాల్లోనే ఇలా నీరు నిలవడం, అందులో కొర్రమట్ట లాంటి ఖరీదైన చేపలు తిరుగుతుండడం చూస్తే హైదరాబాదులో వర్ష తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మామూలుగానే చిన్నపాటి వర్షం కురిసినా హైదరాబాద్ తడిసి ముద్దవుతుంది. అలాంటిది ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వీధుల్లోకే చేపలు వచ్చి చేరడంతో ప్రజలు వింతగా చూస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.