AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఈ చీమలతో బతకడం నా వల్ల కాదు!.. కన్నీళ్లు పెట్టిస్తున్న వివాహిత సూసైడ్‌ నోట్

సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. చీమల ఫోబియాతో బాధపతుడున్న ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం ఇంటికొచ్చిన భర్త ఇంట్లో విగతజీవిగా పడి ఉన్న భార్యను చూసి కన్నీరు మున్నీరుగా విలపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Telangana: ఈ చీమలతో బతకడం నా వల్ల కాదు!.. కన్నీళ్లు పెట్టిస్తున్న వివాహిత సూసైడ్‌ నోట్
Sangareddy News
Anand T
|

Updated on: Nov 06, 2025 | 2:39 PM

Share

చీమల ఫోబియాతో బాధపతుడున్న ఓ వివాహిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. డెడ్‌బాడీ పక్కన దొరికిన సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సూసైడ్‌ నోట్‌ ప్రకారం.. ఆమె చీమల ఫోబియా కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని శర్వా హోమ్స్‌లో శ్రీకాంత్, మనీషా (25) అనే దంపతులు తన కుమార్తేతో పాటు నివసిస్తున్నారు. అయితే మనీషా గత కొంతకాలంగా చీమలంటే తీవ్ర భయంతో (మైర్మెకోఫోబియా) బాధపడుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు మనీషా కుటుంబ సభ్యులు అమెను ఎన్నో హాస్పిటల్‌కు తిప్పారు. చాలా చోట్ల చికిత్స కూడా తీసుకున్నారు. కౌన్సిలింగ్స్ ఇప్పించారు. కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మనీషా మంగళవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం విధుల నుంచి ఇంటికి వచ్చిన భర్త బెడ్‌రూమ్‌ లోపలి నుంచి గడియపెట్టి ఉండడం గమనించి స్థానికుల సహాయంలో డోర్‌ను బద్దలకొట్టాడు. లోపలికి వెళ్లి చూడగా రూమ్‌లో భార్య ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించింది. అది చూసి భర్త కన్నీరుమున్నీరుగా విలపించాడు.

ఇక స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. బాడీ పక్కనే ఉన్న సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్‌లో శ్రీ.. ఐయాం సారీ.. ఈ చీమలతో బ్రతకడం నావల్ల కావట్లేదు. అన్విని జాగ్రత్తగా చూసుకో.. అన్నవరం, తిరుపతి, ఎల్లమ్మ మొక్కులను తీర్చండి అని రాసుకొచ్చింది. ఈ నోట్‌ చదివిన కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.