Telangana: రోడ్డు పక్కన ఏవో వింత ఆకారాలు.. ఫోన్ కెమెరాతో కాస్త జూమ్ చేసి చూడగా
కార్తీకపౌర్ణమి రోజు క్షుద్రపూజలు కలకలం రేపాయి.. గ్రామశివారులో జంతుబలిచ్చి క్షుద్ర పూజలు నిర్వహించిన గుర్తుతెలియని వ్యక్తులు ఊరంతా ఉలిక్కిపడేలా చేశారు..గ్రామ శివారులో జరిగిన క్షుద్రపూజలు అక్కడ కలకలం రేపాయి.. కార్తీకపౌర్ణమి వేల ఎవరు ఇలా క్షుద్రపూజలు నిర్వహించారో అర్థంకాక ఊరంతా ఆందోళన చెందుతున్నారు

ఈ క్షుద్రపూజల ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో జరిగింది.. కార్తీక పౌర్ణమి రాత్రి నిండు పున్నమి వెన్నెల్లో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించారు.. అర్దరాత్రి గ్రామశివారులోని నిర్మానుష ప్రాంతంలో క్షుద్ర పూజలు చేయటం కలకలం రేపింది. ఇల్లంద సబ్ స్టేషన్ నుంచి కట్రియాల వెళ్ళే రహదారి పక్కన నిర్మానుష ప్రాంతంలో పిండితో ముగ్గువేసి అందులో దీపం వెలిగించి అన్నపూజ చేశారు. జంతువును బలిచ్చి రక్తర్పణం చేశారు.. క్షుద్రపూజలు నిర్వహించిన ప్రాంతంలో రక్తర్పణం చూసి ఊరంతా ఆందోళన చెందుతున్నారు.
ఉదయాన్నే ఆ మార్గంలో వెళ్లే వారు క్షుద్రపూజలు నిర్వహించిన ఆనవాళ్లు చూసి ఆందోళనకు గురయ్యారు.. గతంలో కూడా ఈ ప్రాంతంలో ఇదే విధంగా పూజలు నిర్వహించారని గ్రామస్తులు చెబుతున్నారు..ఆ మార్గంలో మార్నింగ్ వాకింగ్ కు వెళ్లెవారు కూడా షాకింగ్ లో ఉన్నారు.. అమావాస్య, పౌర్ణమిరోజు ఇలాంటి తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు నిర్వహించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే వారి పై కఠినచర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.




