AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మహిళా బిల్లుపై కాంగ్రెస్‌ను ఎందుకు నిలదీయలేదు.. రేవంత్‌పై కవిత అటాక్‌

ఉత్తరప్రదేశ్ లో 33% సీట్లను మహిళలకు కేటాయించామని కబుర్లు చెబుతున్న కాంగ్రెస్ నేతలు ఓడిపోయే రాష్ట్రంలో సీట్లు కేటాయించారన్నది గుర్తుంచుకోవాలి. గెలిచిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు 15 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే, ముగ్గురు గెలవగా, 34 మంది మంత్రుల్లో కేవలం ఒక్క మహిళకే అవకాశం ఇచ్చారు. తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ నేతలకు నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధపూరిత రాజకీయాల కోసం మహిళా రిజర్వేషన్ల బిల్లును దశాబ్దాల పాటు...

Telangana: మహిళా బిల్లుపై కాంగ్రెస్‌ను ఎందుకు నిలదీయలేదు.. రేవంత్‌పై కవిత అటాక్‌
MLC Kavitha
Sridhar Prasad
| Edited By: Narender Vaitla|

Updated on: Aug 22, 2023 | 8:14 PM

Share

తమపాలనలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి చేతకాని కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కాంగ్రెస్ పాలించిన 60 ఏళ్ల కాలంలో మహిళల కోసం ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు మహిళా బిల్లుపై వారి అధిష్టానాన్ని ఏ ఒక్క రోజైనా నిలదీశారా? అంటూ ద్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని గత పదేండ్లలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, గాంధీ భవన్ గాడ్సే రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు.

ఉత్తరప్రదేశ్ లో 33% సీట్లను మహిళలకు కేటాయించామని కబుర్లు చెబుతున్న కాంగ్రెస్ నేతలు ఓడిపోయే రాష్ట్రంలో సీట్లు కేటాయించారన్నది గుర్తుంచుకోవాలి. గెలిచిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు 15 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే, ముగ్గురు గెలవగా, 34 మంది మంత్రుల్లో కేవలం ఒక్క మహిళకే అవకాశం ఇచ్చారు. తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ నేతలకు నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధపూరిత రాజకీయాల కోసం మహిళా రిజర్వేషన్ల బిల్లును దశాబ్దాల పాటు వాడుకుందని కవిత విమర్శించారు. మహిళా రిజర్వేషన్లపై చట్టం చేయాలనే మా డిమాండ్ పై వెకిలిగా మాట్లాడడం ఉద్యమకారుల మీద తుపాకీ ఎత్తిన రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యమన్నారు.

ఏ పార్టీ అయినా, ఏ రాష్ట్రం అయినా, మహిళలకు దక్కాల్సినన్ని స్థానాలు దక్కడం లేదనదే మహిళల ఆవేదనగా కవిత పేర్కొన్నారు. రాజ్యంగ పరంగానే మహిళల హక్కులు అమలు కావాలి. దానికి చిత్తశుద్దితో అన్ని పార్టీలు కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు. తాను ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ల కోసం ధర్నా చేస్తే కాంగ్రెస్ పార్టీకి కూడా అధికారికంగా ఆహ్వానం పంపాను. కానీ, కాంగ్రెస్ పార్టీ నుండి ఒక్క ప్రతినిధి కూడా హాజరు కాలేదన్నారు.

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధపూరిత రాజకీయాల కోసం మహిళా రిజర్వేషన్ల బిల్లును దశాబ్దాల పాటు వాడుకుందని కవిత విమర్శించారు. మహిళా రిజర్వేషన్లపై చట్టం చేయాలనే మా డిమాండ్ పై వెకిలిగా మాట్లాడడం ఉద్యమకారుల మీద తుపాకీ ఎత్తిన రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యం. ఏ పార్టీ అయినా, ఏ రాష్ట్రం అయినా, మహిళలకు దక్కాల్సినన్ని స్థానాలు దక్కడం లేదనదే మహిళల ఆవేదనగా కవిత పేర్కొన్నారు. రాజ్యంగ పరంగానే మహిళల హక్కులు అమలు కావాలి. దానికి చిత్తశుద్దితో అన్ని పార్టీలు కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు.తాను ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ల కోసం ధర్నా చేస్తే కాంగ్రెస్ పార్టీకి కూడా అధికారికంగా ఆహ్వానం పంపాను. కానీ, కాంగ్రెస్ పార్టీ నుండి ఒక్క ప్రతినిధి కూడా హాజరు కాలేదన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..