Yadagirigutta: యాదాద్రి నర్సన్నకు మై హోం రామేశ్వరావు భారీ విరాళం..
త్రిదండి చినజీయర్ స్వామితో కలిసి సోమవారం రామేశ్వరావు ఆలయాన్ని సందర్శించి, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం చినజీయర్ చేతుల మీదుగా బంగారాన్ని అర్చకులకు అందించారు. తర్వాత కొండపైన నిర్మించే కల్యాణ మండపానికి, టెంపుల్ సిటీలో ఏర్పాటు చేసే జీయర్ మఠం నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామేశ్వరావు మీడియాతో మాట్లాడారు. మై హోం..
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి మై హోం గ్రూప్స్ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరావు భారీ విరాళాన్ని అందించారు. స్వామివారి ప్రధానాలయ గర్భగుడిపై ఏర్పాటు చేసిన విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం 5 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. త్రిదండి చినజీయర్ స్వామితో కలిసి సోమవారం రామేశ్వరావు ఆలయాన్ని సందర్శించి, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం చినజీయర్ చేతుల మీదుగా బంగారాన్ని అర్చకులకు అందించారు. తర్వాత కొండపైన నిర్మించే కల్యాణ మండపానికి, టెంపుల్ సిటీలో ఏర్పాటు చేసే జీయర్ మఠం నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామేశ్వరావు మీడియాతో మాట్లాడారు. మై హోం ఇండస్ట్రీస్ నుంచి 2 కిలోల బంగారం, మై హోం కన్స్ట్రక్షన్స్ తరఫున 3 కిలోల బంగారం కలిసి మొత్తం 5 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చామని తెలిపారు. స్వామివారి కళ్యాణ మండపాన్ని సొంత ఖర్చులతో నిర్మిస్తున్న తెలిపారు. ఈ అవకాశం లభించడం తనకు అదృష్టమని రామేశ్వరావు అన్నారు. బంగారం విరాళం ఇవ్వడం ద్వారా ఆలయ పునర్మిర్మాణంలో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..