Telangana MLC Election Results 2021: ఎమ్మెల్సీ ఎన్నికల్లో దూసుకెళుతోన్న టీఆర్‌ఎస్ అభ్యర్థి.. ఆరు రౌండ్లు ముగిసేసరికి ఆధిక్యంలో పల్లా రాజేశ్వర రెడ్డి.
Telangana MLC Election Results 2021: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తాజాగా ఆరో రౌండ్ పూర్తయింది. ఆరు రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డికి 22,843 ఓట్ల ఆధిక్యత లభించింది. దీంతో పల్లా మొత్తం 95,317 ఓట్లతో..
Telangana MLC Election Results 2021: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తాజాగా ఆరో రౌండ్ పూర్తయింది. ఆరు రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డికి 22,843 ఓట్ల ఆధిక్యత లభించింది. దీంతో పల్లా మొత్తం 95,317 ఓట్లతో మొదటి స్థానంలో నిలిచారు. ఆరో రౌండ్‌లో పల్లా రాశేశ్వర్ రెడ్డికి 16,204 ఓట్లు వచ్చాయి. ఇక రెండో స్థానంలో తీన్మార్ మల్లన్న కొనసాగుతున్నారు. అతనికి 72,474 ఓట్లు వచ్చాయి. ఇక, మూడో స్థానంలో కోదండరాం ఉన్నారు. ఆయనకు 59,705 ఓట్లు పోలయ్యాయి. మొత్తం చెల్లని ఓట్లు 15, 533. ఆరో రౌండ్‌లో తీన్మార్ మల్లన్నకు 11,910 ఓట్లు రాగా… కొదండరామ్‌కు 10,505 ఓట్లు వచ్చాయి. ఆరో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 5,237 ఓట్లు లభించాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్‌కు 3,994 ఓట్లు దక్కాయి. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలు ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఓట్లను బుధవారం ప్రారంభించారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానం ఓట్ల లెక్కింపును హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతుండగా, వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానం ఓట్ల లెక్కింపును నల్లగొండలోని ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు సుధీర్ఘంగా జరగనుంది. ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు రానున్నాయి. పెరిగిన పోలింగ్‌తో పాటు జంబో బ్యాలెట్‌తో ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు రానున్నాయి. పెరిగిన పోలింగ్‌తో పాటు జంబో బ్యాలెట్‌తో కౌంటింగ్ సవాల్‌గా మారింది. దీంతో ఓట్ల లెక్కింపునకు రెండు రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. కాగా, మూడు షిప్టుల్లో ఓట్లను లెక్కిస్తున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం కౌంటింగ్ కేంద్రాల్లో విస్తృత ఏర్పాట్లు చేసింది.
Also Read: తెలంగాణలో కరోనా సెకండ్‌వేవ్ కలకలం.. వైరస్ బారిన పడుతున్న పాఠశాలల విద్యార్థులు