తెలంగాణపై గురిపెట్టిన జనసేనాని.. ఉమ్మడి నల్గొండ జనసేన జిల్లా కమిటీని ప్రకటించిన పవన్ కళ్యాణ్

త్వరలోనే తెలంగాణాలో పార్టీని విస్తరించనున్నామని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన వీరమహిళా సమావేశంలో చెప్పినట్లుగానే ఓ అడుగు ముందుకు పడింది.

తెలంగాణపై గురిపెట్టిన జనసేనాని.. ఉమ్మడి నల్గొండ జనసేన జిల్లా కమిటీని ప్రకటించిన పవన్ కళ్యాణ్
Janasena
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 18, 2021 | 7:11 PM

Janasena focus on Telangana : జనసేన పార్టీ తెలంగాణాలో విస్తరించే దిశగా ముందు అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదని కొద్దిరోజుల క్రితమే పవన్ కళ్యాణ్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. గౌరవం లేని చోటు ఉండాల్సిన అవసరం లేదంటూ.. భవిష్యత్తులో బీజేపీతో కలిసి పని చేయాల్సిన అవసరం లేదనే సంకేతాలు ఇచ్చారు. త్వరలోనే తెలంగాణాలో పార్టీని విస్తరించనున్నామని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన వీరమహిళా సమావేశంలో చెప్పినట్లుగానే ఓ అడుగు ముందుకు పడింది. ఇందులో భాగంగా గురువారం నల్లగొండ జిల్లా కమిటీని ప్రకటించారు జనసేనాని.

తెలంగాణ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తెలంగాణ బీజేపీకి ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. ఎన్నికలు జరిగిన రోజే టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి మద్దతు ప్రకటించి సంచలన సృష్టించారు. తెలంగాణలో బీజేపీతో ఇక పూర్తి స్థాయిలో తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే త్వరలో నాగార్జున సాగర్ బై ఎలక్షన్లపై పవన్ కళ్యాణ్ ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడ టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వాలని.. దుబ్బాక తరహాలోనే ఈ స్థానాన్ని సొంతం చేసుకోవాలని భారతీయజనతా పార్టీ భావిస్తోంది. ఇందుకోసం పక్కా వ్యూహ రచనలతో ముందుకు వెళ్తున్నారుస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన కమిటీ నియామకం

బీజేపీ ప్లాన్ ఇలా ఉంటే.. ఇక్కడ జనసేన తరపున అభ్యర్థిని బరిలోకి దింపేందుకు పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ విషయాన్ని జనసేన నేరుగా ప్రకటించకపోయినప్పటికీ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి కమిటీలను ఏర్పాటు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న పార్టీ కొత్తగా జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో ఖమ్మంలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని నేతలకు సూచించారు. ఈ క్రమంలోనే నాగార్జునసాగర్ కోసం జనసేన కమిటీలను ఏర్పాటు చేయడంతో.. ఇక్కడ అభ్యర్థిని ఎంపిక చేసి జనసేన బరిలోకి దిగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదిలావుంటే, 2014 లో ఒక్క మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసింది అనంతరం తెలంగాణ కంటే ఆంధ్రావైపే ఎక్కువుగా పవన్ కళ్యాణ్ దృష్టిపెట్టారు. తెలంగాణలో వ్యక్తి గతంగా అభిమానులున్నారు.. వారి ఆలోచనలు అనుగుణంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. మరోవైపు ఇతర పార్టీల్లో కొత్త చర్చ మొదలైంది. సాగర్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడంతో పాటు బీజేపీకి పడాల్సిన జనసేన ఓటు కూడా పక్కకపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి సాగర్ ఉప ఎన్నికకు ముందు కమిటీలు ఏర్పాటు చేసిన జనసేన.. ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలోనే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ బీజేపీకి ఊహించని షాక్ ఇస్తుందా ? అన్నది చర్చనీయాంశంగా మారింది.

Read Also…  కీలక సమయంలో కనిపించని ముగ్గురు ముఖ్య నేతలు.. ఆలోచనలో పడ్డ టీడీపీ అధినాయకత్వం