వాయువేగంతో దూసుకెళ్లిన రేసింగ్‌ కార్లు.. వరుస ప్రమాదాలతో నిరాశలో అభిమానులు..

ఫార్ములా-4లో దుమ్మురేపాడు తెలుగు కుర్రాడు. మొదటి, మూడవ రేస్‌లో..నెల్లూరుకు చెందిన విశ్వాస్‌ విజయరాజ్‌ విజేతగా నిలిచాడు. ఇక 17 ఏళ్ల వయసులోనే ఫార్ములా -4 లో పాల్గొని అత్యంత చిన్న వయసులో రేస్ చేసిన యువకుడిగా నిలిచాడు తెలుగు కుర్రాడు ధృవ్‌.

వాయువేగంతో దూసుకెళ్లిన రేసింగ్‌ కార్లు.. వరుస ప్రమాదాలతో నిరాశలో అభిమానులు..
Car Race In Hyderabad
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 20, 2022 | 8:05 PM

స్ట్రీట్‌ సర్క్యూట్‌పై స్పోర్ట్స్‌ కార్లు రయ్‌..రయ్‌ మంటూ దూసుకెళ్లాయి. ఫార్ములా-4 రేసింగ్‌ క్వాలిఫైయింగ్‌ రౌండ్లలో రేసర్లు దూసుకెళ్లారు. 6 జట్ల మధ్య పోటాపోటీ నడిచింది. ట్రాక్‌పై హైస్పీడ్‌లో రేస్‌ కార్లను రయ్‌మనిపించారు 24 మంది రేసర్లు. ఐతే వరుస ప్రమాదాలతో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌నిలిచిపోయింది. క్వాలిఫైయింగ్ రేసులో వరుస ప్రమాదాలతో రేస్ ఆలస్యంగా మొదలైంది. దీంతో ఫార్ములా-4లో మూడు రేసులు నిర్వహించారు. మయాభావంతో జూనియర్ ఛాంపియన్‌షిప్‌తోనే సరిపెట్టారు నిర్వాహకులు. చీకటి పడటంతో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ను నిలిపివేశారు. హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌, గోవా ఏసెస్‌, చెన్నై టర్బో రైడర్స్‌, బెంగళూరు స్పీడ్‌స్టర్స్‌ జట్లతోపాటు.. స్పీడ్‌మాన్స్‌ ఢిల్లీ, గాడ్‌ స్పీడ్‌ కోచి జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఐతే ఫార్ములా-4లో దుమ్మురేపాడు తెలుగు కుర్రాడు. మొదటి, మూడవ రేస్‌లో..నెల్లూరుకు చెందిన విశ్వాస్‌ విజయరాజ్‌ విజేతగా నిలిచాడు. ఇక 17 ఏళ్ల వయసులోనే ఫార్ములా -4 లో పాల్గొని అత్యంత చిన్న వయసులో రేస్ చేసిన యువకుడిగా నిలిచాడు తెలుగు కుర్రాడు ధృవ్‌.

ఇక ఉత్సాహంగా సాగిన కార్‌ రేస్‌లో చిన్న చిన్న అపశృతులు చోటు చేసుకున్నాయి. వరుస ప్రమాదాలతో ఆలస్యంగా సాగింది ఫార్ములా-4 రేస్‌. ఓ కార్‌ సైడ్‌ డివైడర్‌ను ఢీకొట్టింది. ఐతే రైడర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెంటనే అతన్ని బయటకు తీసి..క్రేన్ల సాయంతో కారును గ్యారేజ్‌కు తరలించారు. ఎన్టీఆర్ మార్గ్‌లో రేసింగ్‌ లీగ్‌లో మరో ప్రమాదం జరిగింది. క్వాలిఫైయింగ్ రేస్‌లో గోవా ఏసెస్ రేసింగ్ కారు..మరో కారును ఢీకొట్టడంతో చెన్నై టర్బో రైడర్స్ మహిళా రేసరర్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించగా..లెగ్‌ ఫ్రాక్చర్‌ అయినట్టు తెలుస్తోంది.

ఇక నిన్న మరో ప్రమాదం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ట్రాక్‌పై ఓ కార్‌ వెళ్తున్న టైమ్‌లో చెట్టుకొమ్మ విరిగిపడింది. ప్రసాద్‌ ఐమాక్స్‌ ఎదుట జరిగిన ఈ ఘటనతో కార్‌ రేసర్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయాడు. క్షణాల్లో అప్రమత్తమై కంట్రోల్‌ చేసి కొద్దిదూరంలో కార్‌ నిలిపేశారు. నిన్న ట్రయల్ రన్‌ సమయంలో ఈ ఘటన జరిగింది. ఐతే రేస్‌లో ఇలాంటి చిన్నచిన్న ప్రమాదాలు జరగడం సహజమంటున్నారు నిర్వాహకులు.

ఇవి కూడా చదవండి

2023 ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ ప్రిపరేషన్‌లో భాగంగా ఈ కార్‌ రేసింగ్‌ నిర్వహించారు. ఈ రేసింగ్‌లో 12 కార్లు, 6 టీమ్‌లు 24 మంది రేసర్లు పాల్గొన్నారు. కొత్త ట్రాక్‌, స్పల్ప ప్రమాదాలతో రేస్‌లు ఎక్కువ సమయం తీసుకున్నాయి. మరోవైపు ట్రాక్‌కు రెండ్రోజులు మాత్రమే అనుమతివ్వడం..అది ఇవాల్టితో ముగియడంతో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ను నిలిపివేశారు నిర్వాహకులు. ఐతే అసలు సిసలైన పందెం నిలిచిపోవడంతో నిరాశతో వెనుదిరిగారు అభిమానులు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి