AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu tips: ఇలా చేస్తే మీ ఇంట్లో మహాలక్ష్మీ అనుగ్రహంతో సిరిసంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి..

ఇలా చేస్తే సంపద పెరగడంతో పాటు కుటుంబసభ్యుల అనుబంధం బలపడుతుంది. అలాగే జీవితంలో నెలకొన్ని ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది.

Vastu tips: ఇలా చేస్తే మీ ఇంట్లో మహాలక్ష్మీ అనుగ్రహంతో సిరిసంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి..
Lotus
Jyothi Gadda
|

Updated on: Nov 20, 2022 | 6:24 PM

Share

ఆ లక్ష్మిదేవి తన కుడి కాలుతో తమ ఇంట అడుగుపెట్టాలని అందరూ కోరుకుంటారు. దానికోసం తీవ్రంగా ప్రయత్నిస్తారు. లక్ష్మిదేవికి ఇష్టమైన వస్తువులలో ఒకటైన తామర పువ్వు కూడా ఆర్థిక శ్రేయస్సుకు దారితీస్తుంది. అందమైన పువ్వులలో తామర పువ్వు ఒకటి. ఈ జల పుష్పానికి సహజమైన ప్రాముఖ్యతతో పాటు జ్యోతిష్య, మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది. తామరపువ్వు విష్ణువుమూర్తి చేతిలో ఉండే పుష్పం..ఈ పువ్వు లక్ష్మిదేవికి ఆసనం. తామర పువ్వుకు డబ్బును ఆకర్షించే శక్తి ఉంది. తామరపువ్వుతో కొన్ని ఉపాయాలు చేస్తే ధనలాభం కలుగుతుందని జ్యోతిష్యశాస్త్రంలో చెప్పబడింది. అలాగే జీవితంలో నెలకొన్ని ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది.

ఆర్థికాభివృద్ధికి తామర పువ్వు: లక్ష్మి దేవికి తామర పువ్వు అంటే ఇష్టం. ప్రతి శుక్రవారం తామరపువ్వును లక్ష్మీదేవి పాదాల వద్ద సమర్పించండి. ఇలా ఐదు శుక్రవారాలు వరుసగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. డబ్బుకు సంబంధించిన ప్రతి సమస్యనూ దీని నుంచి పరిష్కరించుకోవచ్చు.

సంతానం కోసం తామర పువ్వును ఉపయోగించండి : ఏకాదశి రోజున మీరు శ్రీకృష్ణునికి తామరపూవును సమర్పించాలి. సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. సంవత్సరంలో ప్రతి ఏకాదశి నాడు కృష్ణుడికి 2 తామర పువ్వులు సమర్పించాలి. ఇలా చేస్తే త్వరగా సంతానం కలుగుతుందని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

కమలం కుటుంబ కలహాలను పరిష్కరిస్తుంది: బుధవారం నాడు తామరపువ్వుకు చందనాన్ని పూయాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి, గణేశుని పాదాల వద్ద సమర్పించాలి. మీరు పదకొండు బుధవారాలు ఇలా చేస్తే కుటుంబ కలహాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్య ప్రేమ పెరుగుతుంది. అలాగే, మీరు ప్రతిరోజూ తల్లి లక్ష్మిదేవిని పూజించే స్థలంలో తామర పువ్వును ఉంచాలి. ఇలా చేస్తే సంపద పెరగడంతో పాటు కుటుంబసభ్యుల అనుబంధం బలపడుతుంది.

కోరికలను నెరవేర్చడంలో సహాయపడుతుంది: తామర పువ్వును శుభ చిహ్నంగా భావిస్తారు. ఒక వారం పాటు శివలింగంపై తామరపూవు సమర్పించాలి. ఇలా చేస్తే కోరికలన్నీ తీరుతాయి.

తెల్ల కమలంలో శక్తి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శుక్రవారం నాడు కొబ్బరికాయతో పాటు తెల్ల కమలాన్ని పూజించాలి. ఫోటో కింద కొబ్బరికాయపై తెల్లని కమలాన్ని ఉంచి లక్ష్మీదేవిని పూజించాలి. వరుసగా 11 శుక్రవారాలు పూజ చేయాలి. 11వ శుక్రవారం నాడు చెరువులో లేదా నదిలో తామరపూవును వదలాలి. కొబ్బరికాయను ఎర్రటి గుడ్డలో చుట్టి అల్మారాలో ఉంచాలి. ఇలా చేస్తే ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది.

నెగెటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది : తామర పువ్వులో నెగటివ్ ఎనర్జీని దూరం చేసే గుణం ఉంది. లక్ష్మీదేవికి తామరపూవు సమర్పించడం వల్ల ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించవు.

పనిలో విజయం కోసం తామర పువ్వు: తామర పువ్వుకు అపారమైన శక్తి ఉంది. మీరు మీ వృత్తి పరంగా జీవితంలో విజయం సాధించాలంటే మీరు తల్లి లక్ష్మిదేవిని కలువపూలతో పూజించాలి. తర్వాత ఈ పువ్వును ఎర్రటి గుడ్డలో కట్టి అల్మారాలో ఉంచాలి. దీపావళి రోజున తామర పువ్వును లక్ష్మిదేవికి సమర్పించి పూజ చేయాలి. అలా చేయలేని పక్షంలో తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మిదేవి ఫోటోకు పూజ చేయండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి