AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA: ఫిఫా ప్రపంచకప్ ఫీవర్‌.. క్రీడాభిమానులు కలిసి మ్యాచ్ చూసేందుకు ఏకంగా ఓ ఇంటినే కొనేశారు..!

దాదాపు 17 మంది ఫుట్‌బాల్ అభిమానులు కలిసి డబ్బు పెట్టి ఈ భవనాన్ని కొనుగోలు చేశారు. వారంతా కలిసి కొనుగోలు చేసిన ఇంట్లో బ్రెజిల్, అర్జెంటీనా, పోర్చుగల్ దేశాలను చిత్రించడం గమనార్హం.

FIFA: ఫిఫా ప్రపంచకప్ ఫీవర్‌.. క్రీడాభిమానులు కలిసి మ్యాచ్ చూసేందుకు ఏకంగా ఓ ఇంటినే కొనేశారు..!
Keral Footbal Fans
Jyothi Gadda
|

Updated on: Nov 20, 2022 | 5:05 PM

Share

దేవరనాడు కేరళలో ఫిఫా ప్రపంచకప్ ఫీవర్ ఎక్కువైంది. ఖతార్‌లో 2022 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ప్రేమికుల హార్ట్‌బిట్‌ని పెంచుతోంది. ముఖ్యంగా కేరళలో ఫుట్ బాల్ ప్రేమికులు ఫుట్ బాల్ క్రీడపై తమ ప్రేమాభిమానాన్ని విభిన్న రీతిల్లో చాటుకుంటున్నారు. కేరళలోని కొచ్చి జిల్లా ముండక్కముగల్ గ్రామస్తులు ఫుట్‌బాల్‌పై తమకున్న ప్రేమను చాటుకునేందుకు మరో అడుగు ముందుకేసి అందరూ కలిసి మ్యాచ్‌ను చూసేందుకు వీలుగా 23 లక్షల రూపాయల వ్యయంతో ఓ ఇంటిని కొనుగోలు చేశారు.

దాదాపు 17 మంది ఫుట్‌బాల్ అభిమానులు కలిసి డబ్బు పెట్టి ఈ భవనాన్ని కొనుగోలు చేశారు. వారంతా కలిసి కొనుగోలు చేసిన ఇంట్లో బ్రెజిల్, అర్జెంటీనా, పోర్చుగల్ దేశాలను చిత్రించడం గమనార్హం. అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ, పోర్చుగీస్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో,​రొనాల్డోల ఫోటోలను కూడా వారు చిత్రించారు. వారు ఈ ఇంటి లోపల వివిధ ఫుట్‌బాల్ స్టార్ల కటౌట్‌లను కూడా ఏర్పాటు చేశారు.

ఇంటి కొనుగోలుదారుల్లో ఒకరైన షెఫీర్ PA మీడియాతో మాట్లాడుతూ, “తామంతా FIFA ప్రపంచ కప్ కోసం కొత్తగా ఏదైనా చేయాలని ప్లాన్ చేసామని చెప్పారు. తాము 17 మంది బృందం కలిసి అమ్మకానికి పెట్టిన ఇంటిని కొనుగోలు చేసినట్టుగా చెప్పారు. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో పాల్గొనే జట్ల జెండాలతో ఆ ఇంటిని అలంకరించామని చెప్పారు. అందరం ఇక్కడకు చేరుకుని ఫుట్‌బాల్ మ్యాచ్ (ఫిఫా జట్లు)ను పెద్ద స్క్రీన్‌పై చూసేలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఫుట్‌బాల్ చరిత్రలో తొలిసారిగా గల్ఫ్ దేశాల్లో జరుగబోతున్న ఫిఫా వరల్డ్ కప్ – 2022 ను ప్రత్యక్షంగా, పరోక్షంగా చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18వరకు ఖతార్ వేదికగా జరుగబోయే ఈ భారీ టోర్నీని చూసేందుకు కేరళకు చెందిన అభిమానులు ఇలా సరికొత్త ఆలోచన చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి