Isha ambani: మరోసారి తాతైన అపర కుబేరుడు.. కవలలకు జన్మనిచ్చిన ఇషా, ఆనంద్..
అపర కుబేరుడు, రియలన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి తాత అయ్యారు. ముకేశ్ కూతురు ఇషా అంబానీ శనివారం కవలలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆదివారం కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు...
అపర కుబేరుడు, రియలన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి తాత అయ్యారు. ముకేశ్ కూతురు ఇషా అంబానీ శనివారం కవలలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆదివారం కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. అంబానీ, పిరమల్ కుటంబసభ్యులు మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇషా, ఆనంద్ కవలలకు జన్మనిచ్చాన్న విషయాన్ని తెలియజేయడం ఎంతో సంతోషంగా ఉందన్న కుటుంబ సభ్యులు.. ప్రస్తుతం ఇషాతో పాటు ఇద్దరు చిన్నారులు (అమ్మాయి, అబ్బాయి) ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. అదియా, కృష్ణలుగా చిన్నారులకు అప్పుడే నామకరణం చేశారు. ఇషాకు తన చిన్నారులకు అందరి ఆశీస్సులు కావాలని కోరారు. ఇదిలా ఉంటే ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ 2018 డిసెంబర్ 12న వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.
చిన్ననాటి స్నేహితులైన వీరిద్దరూ పెద్దల అంగీకారంతో తన ప్రేమను వివాహం వరకు తీసుకెళ్లారు. ఇషా ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇక ఆనంద్ పిరమల్ విషయానికొస్తే.. ఈయన పిరమల్ గ్రూప్స్ అజయ్- స్వాతి పిరమల్‌ల కుమారుడు. ఆనంద్ పిరమల్ రియాల్టీని స్థాపించారు. అంతేకాకుండా రూరల్ హెల్త్ కేర్ ఇనిషియేటివ్ పిరమల్ స్వస్థ్యకు ఫౌండర్‌గా వ్యవహరిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..