AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shashi Tharoor: ఫన్నీగా ఉన్నా వాస్తవం ఇదే.. ఆలోచింపజేస్తున్న కాంగ్రెస్ లీడర్ శశిథరూర్ ట్వీట్..

మనిషి జీవితంలో మొబైల్ ఫోన్ అతి ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే ఓ బాడీ పార్ట్ లా అయిపోయింది. ఫోన్ లేని క్షణాన్ని ఊహించుకోలేం. ఒక రోజు కాదు కదా.. సరిగ్గా గంట కూడా ఫోన్ లేకండా...

Shashi Tharoor: ఫన్నీగా ఉన్నా వాస్తవం ఇదే.. ఆలోచింపజేస్తున్న కాంగ్రెస్ లీడర్ శశిథరూర్ ట్వీట్..
Shashi Tharoor
Ganesh Mudavath
|

Updated on: Nov 20, 2022 | 1:57 PM

Share

మనిషి జీవితంలో మొబైల్ ఫోన్ అతి ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే ఓ బాడీ పార్ట్ లా అయిపోయింది. ఫోన్ లేని క్షణాన్ని ఊహించుకోలేం. ఒక రోజు కాదు కదా.. సరిగ్గా గంట కూడా ఫోన్ లేకండా జీవించలేని పరిస్థితులు వచ్చేశాయి. మొబైల్‌ ఫోన్‌ మనిషి జీవితంలో ఎంత ముఖ్యమైన భాగం అయిపోయిందో వేరే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకూ మొబైల్‌తోనే గడిపేస్తున్నారు. చిన్నా , పెద్దా, ఆడా, మగా, పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అందరూ విచ్చలవిడిగా ఫోన్ ను వాడేస్తున్నారు. అంతలా మనిషి జీవితంతో ముడిపడిపోయింది. ఇదిలా ఉంటే ఈ మొబైల్‌ ఫోన్‌కు సంబంధించి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. అది ఇప్పుడు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అంతే కాకుండా ఆలోచింపజేస్తోంది. వాస్తవానికి ఎంపీ శశి థరూర్‌ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఆసక్తికరమైన పోస్టులు చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తుంటారు. తాజాగా ఆయన 1919 నాటి ఓ కార్టూన్‌ను ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. ఈ కార్టూన్‌లో ఓ వ్యక్తికి సంబంధించి వివిధ సందర్భాల్లో ఫోన్‌ మోగితే ఆ వ్యక్తి ఎలా స్పందిస్తాడు అనేది సూచిస్తోంది.

ఉదాహరణకు రైలుకోసం ఓ ప్రయాణికుడు కంగారుగా పరుగెడుతున్నప్పుడు, చేతినిండా బ్యాగులతో సామాన్లు పట్టుకొని వర్షంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పడు, చుట్టూ పెద్ద పెద్ద శబ్దాలతో పక్కనున్న వ్యక్తి మాట్లాడినా వినిపించనంతటి రణగొణ ధ్వనుల మధ్య ఉన్నప్పుడు, ఓ తల్లి తన చేతిలోని చంటిబిడ్డను వేరొకరికి అందిస్తున్నప్పుడు, పెళ్లి సందర్భంగా వధువు మెడలో తాళికడుతున్న సమయంలో మొబైల్‌ ఫోన్‌ మోగితే ఎలా ఉంటుందో ఆ కార్టూన్‌ చెబుతోంది. అప్పుడప్పుడే వినియోగంలోకి వస్తున్న మొబైల్‌ ఫోన్‌ వల్ల కలిగే ఇబ్బందులను అప్పుడే ఊహించి వేసిన కార్టూన్‌ అది.

ఇవి కూడా చదవండి

సాంకేతికతకు సంబంధించిన అంచనాలు ఒక్కోసారి చాలా వింతగా ఉంటాయి. 1919 నాటి ఈ కార్టూన్‌ని చూడండి. అప్పట్లో ల్యాండ్‌ లైన్‌ ఫోన్లు ఎక్కువగా ఉండేవి. కానీ, ఇది మొబైల్‌ ఫోన్‌.. 80 సంవత్సరాల తర్వాత దానివల్ల వచ్చే ఇబ్బందిని అప్పట్లోనే ఊహించి వేసిన కార్టూన్‌ ఇది. మొబైల్‌ వల్ల సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నా పెడచెవిన పెట్టేస్తున్నారు. అంటూ శశిథరూర్‌ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..