AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love: చనిపోయిన ప్రేయసిని పెళ్లాడిన యువకుడు.. మరొకరిని పెళ్లి చేసుకోనంటూ ఎమోషనల్

ప్రేమ గుడ్డిది. ప్రేమకు హద్దుల్లేవంటారు.. అసోంలో జరిగిన ఘటన ఈ మాటల్ని నిజం చేస్తోంది.

Love: చనిపోయిన ప్రేయసిని పెళ్లాడిన యువకుడు.. మరొకరిని పెళ్లి చేసుకోనంటూ ఎమోషనల్
Man Marries Dead Girlfriend
Ram Naramaneni
|

Updated on: Nov 19, 2022 | 9:59 PM

Share

అమర ప్రేమ అంటే ఇదే.. ప్రేయసి చనిపోయినప్పటికి అతడి ప్రేమ మాత్రం చావలేదు. చనిపోయిన లవర్‌ను పెళ్లాడాడు అసోం యువకుడు. అసోంలోని మోరిగావ్‌కు చెందిన బిటుపన్‌ తములి అనే యువకుడు ప్రాథనా బోరాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. అయితే అనారోగ్యంతో ఆమె చనిపోయింది. ఆమె మరణాన్ని తట్టుకోలేకపోయాడు బిటుపన్‌. ప్రాథనా మృతదేహానికి తాళి కట్టాడు. ప్రాథనా తన భార్య అని, మరొకరిని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని శపథం చేశాడు బిటుపన్‌. ప్రేమ శాశ్వతం అంటూ సందేశాన్ని ఇచ్చాడు.

27 ఏళ్ల ప్రాథనా అంత్యక్రియల్ని దగ్గరుండి నిర్వహించాడు బిటుపన్‌. అంత్యక్రియ ఏర్పాట్లను స్వయంగా తానే పర్యవేక్షించాడు. బోరా నుదుటిపై ముద్దులు పెడుతూ.. వెక్కి వెక్కి ఏడ్వడం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. అంత్యక్రియలు పూర్తయ్యేదాకా బిటుపన్‌ ఏడుపు ఆగలేదు. ఉబికివస్తోన్న కన్నీళ్లను దిగమింగుకుంటూ ప్రాథనా అంత్యక్రియల్ని నిర్వహించాడు. ప్రాథనా-బిటుపన్‌ చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. తమ కుటుంబాల సమ్మతితో రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తున్నారు. వీరి ప్రేమను ఏనాడో పెద్దలు అంగీకరించారు. త్వరలో ఈ ప్రేమ జంట పెళ్లికి రెడీ అవుతోంది. అంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. కొన్ని రోజుల క్రితం ప్రాథనా ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను గువహటిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఆమెను కాపాడేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

బిటుపన్‌ లాంటి ప్రేమికుడు దొరకడం తమ సోదరి చేసుకున్న అదృష్టమని చెప్పింది ప్రాథనా సిస్టర్‌. బిటుపన్‌ను పెళ్లి చేసుకోవాలన్న తమ చెల్లెలి ఆకాంక్ష తీరిందంటూ కన్నీటిపర్యంతమైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..