Odisha Ragging Case: ఒడిశా కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థికి బలవంతంగా ముద్దు.. వినోదం చూసిన తోటి స్టూడెంట్స్.. ఐదుగురి అరెస్ట్

తోటి విద్యార్థిని ర్యాగింగ్ చేస్తున్న సమయంలో చాలా మంది విద్యార్థినిలు అక్కడ ఉన్నారు.. ఏ ఒక్కరూ ఆ మైనర్ బాలిక విద్యార్థికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు.. లైంగిక వేధింపులను వ్యతిరేకించలేదు. అంతేకాదు అందరూ ఉల్లాసంగా నవ్వడం కనిపించింది.

Odisha Ragging Case: ఒడిశా కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థికి బలవంతంగా ముద్దు.. వినోదం చూసిన తోటి స్టూడెంట్స్.. ఐదుగురి అరెస్ట్
Odisha Ragging Case
Follow us
Surya Kala

|

Updated on: Nov 19, 2022 | 9:11 PM

దేశంలో ర్యాగింగ్ కు అడ్డుకట్ట వేయడం కోసం అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎక్కడో చోట ర్యాగింగ్ కలకలం సృష్టిస్తూనే ఉంది. తాజాగా  ఒడిశాలోని ఓ ప్రభుత్వ కళాశాలలో ర్యాగింగ్‌ ఘటన వెలుగుచూసింది. గంజాం జిల్లాలోని ఒక కళాశాలలో విద్యార్థుల బృందం ఒక మైనర్ బాలికను బలవంతంగా ముద్దు పెట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరు మైనర్లతో సహా ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ప్రమేయమున్న విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకున్న కళాశాల యాజమాన్యం 12 మంది విద్యార్థులను కాలేజీ నుంచి బహిష్కరించింది. ప్రస్తుతం ర్యాగింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో సీనియర్ల ఒత్తిడితో ఒక ఫ్రెషర్ మైనర్ బాలికను ముద్దుపెట్టుకోవడం కనిపిస్తుంది.

మైనర్ బాలిక గత నెలలోనే ఈ కాలేజీలో చేరింది. మైనర్ బాలిక విద్యార్థినిని బలవంతంగా ముద్దు పెట్టుకోమని కొందరు సీనియర్లు ఫ్రెషర్‌ను కోరడం వీడియోలో చూడవచ్చు. దీంతో ఆ అమ్మాయి భయంతో వెనక్కి అడుగు వేస్తుంటే.. ఒక సీనియర్ ఆమె చేయి పట్టుకున్నాడు. ఓ యువకుడు  సీనియర్‌ చర్యని వ్యతిరేకించాడు. అమ్మాయిని  ముద్దు పెట్టుకోవడానికి  నిరాకరించాడు. దీంతో ఫ్రెషర్‌ యువకుడిని మరొక యువకుడు చెంపదెబ్బ కొట్టాడు. సీనియర్ల ఒత్తిడితో, ఫ్రెషర్ మైనర్ బాలికను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. ఈ ర్యాగింగ్‌ ఘటన జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల పలువురు విద్యార్థులు వినోదం చూస్తున్నట్లు చూస్తున్నారు. ఈ గుంపులో ఒక విద్యార్థి ఈ ఘటనను  వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ర్యాగింగ్ కు పాల్పడిన  ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

ఎంజాయ్ చేస్తున్న స్టూడెంట్స్:

ఇవి కూడా చదవండి

ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే.. ఇలా తోటి విద్యార్థిని ర్యాగింగ్ చేస్తున్న సమయంలో చాలా మంది విద్యార్థినిలు అక్కడ ఉన్నారు.. ఏ ఒక్కరూ ఆ మైనర్ బాలిక విద్యార్థికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు.. లైంగిక వేధింపులను వ్యతిరేకించలేదు. అంతేకాదు అందరూ ఉల్లాసంగా నవ్వడం కనిపించింది. ఘటనకు పాల్పడిన విద్యార్థులందరినీ గుర్తించి.. కాలేజీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రమీలా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ 12 మంది స్టూడెంట్స్ ను సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కు అనుమతించబోమని ప్రిన్సిపాల్ తెలిపారు.

నిందితుడిపై కేసు నమోదు: గురువారం జరిగిన క్రమశిక్షణ కమిటీ.. యాంటీ ర్యాగింగ్‌ సెల్‌ సమావేశంలో 12 మంది విద్యార్థులను కాలేజీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఖడంగా చెప్పారు.  అరెస్టయిన ఐదుగురు విద్యార్థుల్లో ముగ్గురు 18 ఏళ్లు పైబడిన వారేనని.. మిగిలిన ఇద్దరు స్టూడెంట్స్ మైనర్లని పోలీసులు వెల్లడించారు. ఇది కేవలం ర్యాగింగ్ కేసు మాత్రమే కాదని.. లైంగిక వేధింపుల కేసు కూడా అని పోలీసులు చెప్పారు. నిందితులపై పలు ర్యాగింగ్ సెక్షన్లతో పాటు లైంగిక నేరాల కేసు, చిన్నారులకు పోలీసు రక్షణ (పోక్సో) చట్టం, ఐటీ చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..