Mangaluru Blast Case: ఐఈడీతోనే ఆటోలో పేలుడు.. ఉగ్ర లింకులతో రంగంలోకి ఎన్ఐఏ.. మంగళూరులో హై అలర్ట్..
నిన్న తమిళనాడు.. ఇప్పుడు కర్నాటక.. టెర్రర్ లింక్‌లతో బ్లాస్ట్‌లు జరగడం టెన్షన్ పెడుతోంది. కోయంబత్తూర్‌లో కార్ బ్లాస్ట్ కేసు మర్చిపోకముందే.. ఇప్పుడు కర్నాటకలోని మంగళూరులో ఆటో పేలుడు జరగడం, దానికి ఉగ్రవాదంతో లింక్ ఉండడంతో హైఅలర్ట్ ప్రకటించారు.
Mangaluru auto blast case: నిన్న తమిళనాడు.. ఇప్పుడు కర్నాటక.. టెర్రర్ లింక్‌లతో బ్లాస్ట్‌లు జరగడం టెన్షన్ పెడుతోంది. కోయంబత్తూర్‌లో కార్ బ్లాస్ట్ కేసు మర్చిపోకముందే.. ఇప్పుడు కర్నాటకలోని మంగళూరులో ఆటో పేలుడు జరగడం, దానికి ఉగ్రవాదంతో లింక్ ఉండడంతో హైఅలర్ట్ ప్రకటించారు. కుక్కర్‌లో IEDని ఉంచడం వల్లే శనివారం మధ్యాహ్నం ఈ బ్లాస్ట్ జరిగినట్టు.. పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. ఆటోలో కుక్కర్‌తో ఉన్న బ్యాగ్ తీసుకెళ్తోంది ప్రేమ్‌రాజ్‌గా గుర్తించారు. అతని పేరు, ఆధార్ కార్డ్, అడ్రస్ అన్నీ ఫేక్ అని తేల్చారు. నెల కిందటే మైసూర్‌లో నకిలీ డాక్యుమెంట్లతో ఇతను ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఆ రెంటల్ డాక్యుమెంట్‌లో ఇచ్చిన హుబ్లీ చిరునామా కూడా ఫేకే. ప్రేమ్‌రాజ్ పేరుతో ఇతను ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేసుకున్నాడు.. అతని వెనుక ఎవరు ఉన్నారు అనేదానిపై ఇప్పుడు NIA దృష్టి పెట్టింది. ప్రేమ్‌రాజ్ ఇంటి యజమాని మోహన్‌ను ప్రశ్నిస్తున్నారు.
పేలుడు ఘటనలో గాయలతో మాట్లాడలేని స్థితిలో ప్రేమ్‌రాజ్ ఉన్నాడు. అతను నోరు విప్పితే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ముందుగా ఈ పేలుడు ఘటననను ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగానే భావించారు. కానీ.. కుక్కర్, అందులో బ్యాటరీలు లాంటివి చూశాక టెర్రర్ లింక్‌పై దృష్టి పెట్టారు. ప్రాథమిక విచారణలోనే పేలుడు వెనుక ఉగ్రకోణం కన్ఫామ్ అయ్యింది. వెంటనే DGP దీనిపై ప్రకటన చేశారు. యాక్ట్ ఆఫ్ టెర్రర్‌గా దీన్ని గుర్తించిన వెంటనే జాతీయ దర్యాప్తు సంస్థల సాయం కోరారు. NIA కూడా వెంటనే రంగంలోకి దిగింది. ఘటనా స్థలాన్ని అధికారులు పరిశీలించారు.
శనివారం నమోదైన మంగళూరు ఆటోరిక్షా పేలుడు కేసుపై కేంద్ర భద్రతా బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. ఈ సంఘటన ఉగ్రవాద చర్యగా పేర్కొన్నారు. ఇప్పటికే పోలీసులు పలు కీలక వివరాలను సేకరించాయని తెలిపారు. కర్ణాటక పోలీసులు దీనిని ఉగ్ర చర్యగా నిర్ధారించారన్నారు. పేలుడు వెనుక ఉగ్రవాద సంస్థలు ఉండవచ్చని.. అన్ని వివరాలు ఒకటి రెండు రోజుల్లో బయటకు వస్తాయిని రాష్ట్ర మంత్రి తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..