Hyderabad: వాహనదారులకు అలెర్ట్.. రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే వాయింపే.. ఇవిగో పెరిగిన ఫైన్స్

ఇంక లైట్ తీసుకోవడానికి లేదు. రూల్స్ అతిక్రమిస్తే ఫైన్ వాసిపోద్ది అంతే. ముఖ్యంగా రాంగ్ రూట్‌లో డ్రైవ్ చేసినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా భారీగా ఫైన్స్ వడ్డించనున్నారు ట్రాఫిక్ పోలీసులు.

Hyderabad: వాహనదారులకు అలెర్ట్.. రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే వాయింపే.. ఇవిగో పెరిగిన ఫైన్స్
Hyderabad Traffic Police
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 19, 2022 | 7:40 PM

ట్రాఫిక్ నిబంధనలు పాటించండి ఫ్లీజ్ అంటే.. ఒక్కరు కూడా మాట వినే పరిస్థితి లేదు. ఎన్నిసార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా కించిత్ మార్పు లేదు. డ్రంక్ డ్రైవ్ చేస్తే.. టెర్రరిస్టులతో సమానం అని చెప్పినా పట్టించుకునే వాడు లేదు. ఎడా పెడా ఇష్టం వచ్చినట్లు వెళ్లిపోవడమే. హైదరాబాద్‌లోని ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు ఇటీవలే ట్రాఫిక్ పోలీసులు ఆపరేషన్ రోప్ చేపట్టారు. అది కాస్తా సక్సెస్ ట్రాక్‌లో వెళ్తుంది. రూల్స్ పాటించని వాహనదారులకు భారిగా పైన్ విధిస్తూ ఉండటంతో.. అప్రమత్తంగా డ్రైవ్ చేస్తున్నారు. సర్కిల్స్ వద్ద స్టాప్‌ లైన్ దాటితే 100 రూపాయలు, ఫ్రీ లెప్ట్‌కు బ్లాక్ చేస్తే 1000 వెయ్యి రూపాయలు, పాదాచారులకు అడ్డు కలిగించేలా వాహనాలు నిలిపితే 600 రూపాయలు….. ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే భారీ ఫైన్స్ వేస్తూ వాహనదారులను ట్రాక్‌లోకి తీసుకువస్తున్నారు.

తాజాగా ఈ రూల్స్ మరింత కఠినతరం చేశారు. రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేస్తే రూ.1700, ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1200 ఫైన్ వేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి దీనికి ముహూర్తం ఫిక్స్ చేశారు. రూల్స్ పాటించని వాహనాదారులు నిఘా కెమెరాలకు చిక్కినా భారీ ఫైన్స్ తప్పవని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. ట్రాఫిక్‌ రద్దీని కంట్రోల్ చేసేందుకు ప్రతి ఒక్కరు రూల్స్ పాటించాలని.. రోడ్లపై ఎటువంటి ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగించేలా సహకరించాలని పోలీసులు వాహనాదారులను కోరుతున్నారు.

ట్రాఫిక్‌ రద్దీని నియంత్రణకు సరైన పద్దతులు పాటించికపోతే బెంగళూరు నగర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు… హైదరాబాద్‌ వాసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తోందని పోలీసులు భావిస్తున్నారు. అందుకే కాస్త కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ.. నిబంధనలు పాటించని వాహనదారుల బెండు తీస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..