TRS vs BJP: రోటీన్‌కి భిన్నంగా బీజేపీ హోర్డింగ్స్.. సొమ్మొకరిది-సోకొకరిది అంటూ టీఆర్‌ఎస్ టార్గెట్‌గా పోస్టర్లు, ఫ్లెక్సీలు
రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి అంటూ బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టారు. రాజేంద్రనగర్ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులెన్ని? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందెంత? అంటూ లెక్కలతో సహా భారీ హోర్డింగ్స్ పెట్టారు.
బీజేపీ, టీఆర్‌ఎస్ వార్‌లో మళ్లీ ఫ్లెక్సీ ఫైట్ మొదలైంది. మోడీకి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్, కేసీఆర్‌కి వ్యతిరేకంగా బీజేపీ బ్యానర్లు, కటౌట్స్ పెట్టడం కామన్. కానీ, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో అందుకు భిన్నంగా బీజేపీ హోర్డింగ్స్ వెలిశాయ్. అభివృద్ధిలో ఎవరి వాటా ఎంత?. కేంద్రం ఇచ్చిన నిధులెన్ని? రాష్ట్రం ఇచ్చిన సొమ్మెంత?. ప్రజలారా ఆలోచించండి అంటూ హోర్డింగ్స్ పెట్టారు లోకల్ బీజేపీ లీడర్స్. సొమ్ము ఒకరిది-సోకొకరిది అంటూ రాజేంద్రనగర్ నియోజకవర్గం అంతటా పోస్టర్లు అంటించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి అంటూ బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టారు. రాజేంద్రనగర్ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులెన్ని? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందెంత? అంటూ లెక్కలతో సహా భారీ హోర్డింగ్స్ పెట్టారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రం 44కోట్ల 26లక్షల రూపాయలు ఇస్తే, రాష్ట్రం కేవలం 25కోట్లు మాత్రమే కేటాయించిందంటున్నారు బీజేపీ లీడర్స్. అలాగే హైదరాబాద్ శివారున ఉన్న శంషాబాద్, బండ్లగూడ మండలాల్లో గ్రామాల వారీగా ఎవరెవరు ఎంతిచ్చారో అంకెలతో సహా పోస్టర్లు అంటించారు. శంషాబాద్ మండలానికి కేంద్రం 17కోట్ల 81లక్షల రూపాయలు ఇస్తే, స్టేట్ గవర్నమెంట్ కేవలం 8కోట్ల 63లక్షలు మాత్రమే ఇచ్చిందంటూ బ్యానర్లేశారు. బండ్లగూడ మండలానికి మోదీ ప్రభుత్వం 5కోట్ల 82లక్షలు కేటాయిస్తే, రాష్ట్రం 3కోట్ల 15లక్షలు ఇచ్చిందంటూ పోస్టర్లు అంటించారు.
ప్రజలారా ఆలోచించండి-రాష్ట్రాభివృద్ధిలో ఎవరి వాటా ఎంతో గమనించండి అంటూ పెద్దపెద్ద హోర్డింగ్స్ పెట్టారు. నిజంగా అభివృద్ధి చేస్తున్నది ఎవరు? చేశామని చెప్పుకుంటున్నది ఎవరు?, ప్రజలారా మేల్కోండి-నిలదీయండి అంటూ బ్యానర్లు కట్టారు. రొటీన్‌కి భిన్నంగా బీజేపీ ఏర్పాటుచేసిన హోర్డింగ్స్, పోస్టర్లు ప్రజలను ఆకట్టుకుంటున్నాయ్. మరి, బీజేపీ చెబుతోన్న ఈ లెక్కలకు టీఆర్‌ఎస్ నుంచి కౌంటర్ నెంబర్స్ వస్తాయోలేదో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..