Hyderabad: రయ్ రయ్ మంటూ అదరగొట్టిన రేసర్లు.. మెరుపు వేగంతో దూసుకెళ్లిన కార్లు..

హైదరాబాద్ వాసులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఫస్ట్ డే ప్రాక్టీస్ తోనే రేసర్లు అదరగొట్టారు. రయ్.. రయ్ మంటూ భారీ శబ్దం, మెరుపు వేగంతో సాగర తీరం సందడిగా...

Hyderabad: రయ్ రయ్ మంటూ అదరగొట్టిన రేసర్లు.. మెరుపు వేగంతో దూసుకెళ్లిన కార్లు..
Car Race In Hyderabad
Follow us

|

Updated on: Nov 20, 2022 | 6:42 AM

హైదరాబాద్ వాసులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఫస్ట్ డే ప్రాక్టీస్ తోనే రేసర్లు అదరగొట్టారు. రయ్.. రయ్ మంటూ భారీ శబ్దం, మెరుపు వేగంతో సాగర తీరం సందడిగా మారింది. ఆదివారం ఇండియన్ రేసింగ్ లీగ్ తో పాటు మధ్యలో ఫార్ములా- 4 జరగనుంది. ట్రాక్ అలవాటు కోసం వన్ డే తీసుకున్న రేసర్లు అసలు రేస్ లో అదరగొడతారని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సాగర తీరంలో రయ్ రయ్ అంటూ రేసింగ్ కార్లు సందడి చేశాయి. శనివారం మధ్యహ్న రెండు గంటల నుంచే పోటీలో ఉన్న ఆరు జట్ల రేసర్లు ట్రాక్ పై చక్కర్లు కొట్టారు. రేస్ ను చూసేందుకు ప్రేక్షకులు ఆన్‌లైన్ లో టికెట్లు బుక్ చేసుకుని రాగా ట్రాక్ చూట్టూ సాధారణ ప్రజలు అధిక సంఖ్యలో రేసింగ్ ను వీక్షించారు. తొలిరోజు క్వాలిఫైయింగ్ 1, 2 తో పాటు ఇండియన్ రేసింగ్ లీగ్ లో రేస్ వన్ రేస్ నిర్వహించాల్సి ఉండగా ట్రాక్ పై డ్రైవర్లు అలవాటు పడటం కోసం డే అంతా ప్రాక్టీస్ జరిగింది. కానీ షో మాత్రం కార్ల మెరుపు వేగంతో అదిరిపోయింది.

ఆదివారం ఇండియన్ రేసింగ్ లీగ్ లో భాగంగా మూడు రేస్ లు జరగనున్నాయి. వీటి మధ్యలో చిన్న కార్లతో ఫార్ములా 4 నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు 10 నిమిషాలు ఫార్ములా 4 క్వాలిఫైయింగ్ రేస్ తో గేమ్స్ ప్రారంభమవుతాయి. 9.20 కి ఇండియన్ రేసింగ్ లీగ్ క్వాలిఫైయింగ్ 1, 9.40 కి ఇండియన్ రేసింగ్ లీగ్ క్వాలిఫైయింగ్ 2 జరుగుతాయి. 10.15 గంటలకు ఫార్ములా 4 లో రేస్ 1 స్టార్ట్ అయ్యి అరగంట పాటు జరుగుతుంది. 11.10 ఇండియన్ రేసింగ్ లీగ్ లో రేస్ వన్ స్టార్ట్ అవుతుంది. 25 నిమిషాల అసలైన రేస్ ఆకట్టుకోనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఫార్ములా 4 లో రేస్ -2, మధ్యాహ్నం 1.35 కు ఫార్ములా 4 లో రేస్ -3 జరుగుతాయి. 2.30 కి ఇండియన్ రేసింగ్ లీగ్ లో రేస్ 2 జరుగుతుంది. 3.50 ఇండియన్ రేసింగ్ లీగ్ లో రేస్-3 స్టార్ట్ అయ్యి 40 నిమిషాల పాటు జరుగుతుంది. ఈ ఇండియన్ రేసింగ్ లీగ్ లో 12 కార్లు

6 జట్లు, ప్రతి జట్టులో 4 డ్రైవర్లు ఉన్నారు. వీరిలో 50 శాతం దేశంలోని రేసర్లు కాగా మరో 50 శాతం విదేశీ రేసర్లు పాల్గొంటారు. మొత్తం 7,500 మంది వరకు చూసేందుకు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఈ రేసులో బెంగళూరు, బ్లాక్ బర్డ్స్ హైదరాబాద్, చెన్నై, గోవా, దిల్లీ, కొచ్చి బృందాలు పాల్గొన్నాయి. ఇండియన్ రేసింగ్ లీగ్ మొత్తం రేపే నిర్వహిస్తామని…క్వాలిఫయింగ్ రేస్ కూడా రేపే ఉంటుంది ఆర్‌ఆర్‌పిఎల్ డైరెక్టర్ అఖిలేష్ తెలిపారు. ప్రేక్షకులు రేపు ఉదయం 8 గంటల వరకు చేరుకోవాలని సూచించారు. ట్రాక్ పక్కన భారీ కేడ్స్ సరిగా ఏర్పాటు చేయకపోవడంతో రేసు ప్రాక్టీస్ కిందే ఇవాళ నిర్వహించామన్నారు. టికెట్స్ బుక్ చేసుకున్న వారి ఎంట్రీ ఆదివారం ఇబ్బంది కలగకుండా చూస్తామన్నారు.

ఇవి కూడా చదవండి

ఇలాంటి ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహంచడం చాలా పెద్ద పెద్ద విషయమని, డ్రైవర్ సేఫ్టీకి ముఖ్య ప్రాధాన్యత ఇచ్చారని తెలుగు రేసర్ అనిందిత్ రెడ్డి తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాక్ కాబట్టి అర్దం చేసుకోవడానికి టైమ్ పడుతుందని, ఈ ట్రాక్ పై గరిష్ఠంగా గంటకు 240 కిలోమీటర్ల వేగం వరకు ఉంటుందని తెలిపారు. సాయంత్రం ఐమ్యాక్స్ వద్ద రేసింగ్ ను మంత్రి కేటీఆర్ వీక్షించారు. ట్రయల్ రేస్ ను జెండా ఊపి ప్రారంబించారు. రేసర్లతో ముచ్చటించారు. నిర్వహకులతో మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు. కేటీఆర్ కుమారడు హిమన్షు వీక్షించేందుకు వచ్చారు. సినీ నటుడు నిఖిల్ సిద్దార్ధ్ కూడా ఐమ్యాక్స్ వద్ద రేసింగ్ ను వీక్షించారు. ఇలాంటి ఈవెంట్ హైదరాబాద్ లో జరగటం చాలా మంచి పరిణామమని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచుతుందని ఆయన తెలిపారు.

టికెట్లు బుక్ చేసుకుని రేసింగ్ వీక్షించే వారు వారికి కేటాయించిన గేటు వద్దకు చేరుకునేందుకు కొంత గందరగోళం నెలకొంది. వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాల నుంచి వచ్చేందుకు ఏర్పాటు చేసిన షటిల్ సర్వీసులు సరిగా అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిర్వహకులు మాత్రం ఆదివారం ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకుంటామని తెలిపారు. మరో వైపు వర్కింగ్ డే రోజు రేసింగ్ నిర్వహించడతో పలువురు వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు . తెలుగుతల్లి ఫ్లై ఓవర్, ఖైరతాబాద్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్.. ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్
కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్.. ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్
కేసీఆర్ ఏం మాట్లాడుతారు.? ఓటమిపై ఎలా స్పందిస్తారు.?
కేసీఆర్ ఏం మాట్లాడుతారు.? ఓటమిపై ఎలా స్పందిస్తారు.?
400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..
400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..
పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?
పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?
హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..
హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..
లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్..
లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్..
కల్కి హీరోయిన్ సిస్టర్ ఇండియన్ ఆర్మీలో ఏం చేసేవారో తెలుసా..?
కల్కి హీరోయిన్ సిస్టర్ ఇండియన్ ఆర్మీలో ఏం చేసేవారో తెలుసా..?
ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేన్ సమస్య దరిదాపులకురాదు
ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేన్ సమస్య దరిదాపులకురాదు
ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా
ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్