Telangana: చలి గుప్పిట్లో తెలంగాణ.. గజగజ వణుకుతున్న జనాలు.. మరో రెండు రోజుల పాటు ఇదే సిట్యువేషన్..

తెలంగాణలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. సాధారణం కన్నా తక్కువగా నమోదవుతున్న టెంపరేచర్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం నుంచి కొంచెం, కొంచెం పెరుగుతున్న...

Telangana: చలి గుప్పిట్లో తెలంగాణ.. గజగజ వణుకుతున్న జనాలు.. మరో రెండు రోజుల పాటు ఇదే సిట్యువేషన్..
Telangana&andhra Pradesh Winter
Follow us

|

Updated on: Nov 20, 2022 | 8:11 AM

తెలంగాణలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. సాధారణం కన్నా తక్కువగా నమోదవుతున్న టెంపరేచర్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం నుంచి కొంచెం, కొంచెం పెరుగుతున్న చలి.. అర్థ రాత్రి, వేకువ జామున తీవ్రంగా మారుతోంది. దీంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణాల్లోనూ చలి తీవ్రత అధికంగా ఉంది. పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులకు రోడ్డు కనిపించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నాయన్న అంచనాలు వణుకు పుట్టిస్తున్నాయి. వచ్చే ఒకటి, రెండు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు అక్కడక్కడ 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29.8 డిగ్రీల సెల్సియస్‌ నుంచి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 16.1 డిగ్రీల సెల్షియస్‌ మధ్య నమోదవుతాయని పేర్కొంది.

అడవుల జిల్లాగా పేరు గాంచిన ఆదిలాబాద్‌ జిల్లాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రత విపరీతంగా పడిపోతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10.7 డిగ్రీల సెల్సియ్‌సగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ తగ్గింది. మరోవైపు.. ఖమ్మం జిల్లాల్లో ఎండ పెరిగింది. ఆ జిల్లాల్లో క్రమేపి ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల సెల్సియస్‌ మేరకు పెరిగినట్లు తెలిపింది. గడిచిన 24 గంటల్లో ఆ జిల్లాల్లో 32 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. ఇక హకీంపేట్‌, రామగుండం, హన్మకొండ లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి.

మరోవైపు.. రాబోయే రెండు రోజుల పాటు తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సోమవారం దక్షిణ తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వివరించారు. మరో వైపు రాజధాని నగరంలోనూ శీతల గాలులు పెరిగిపోతున్నాయి. గ్రేటర్‌లో రాగల రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..