AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్పత్రి ఐసీయూలో ఆవు హడావుడి.. వైరలవుతున్న వీడియో.. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఆసుపత్రి లోపల హాయిగా నడుస్తున్న ఆవు అక్కడ చెత్త కుండీలో వేసిన వైద్య వ్యర్థాలను తింటోంది. రోజంతా ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డులను మోహరించినా ఆవును తరిమికొట్టే వారు లేరు.

ఆస్పత్రి ఐసీయూలో ఆవు హడావుడి.. వైరలవుతున్న వీడియో.. ఇంతకీ ఏం జరిగిందంటే..
Cow Roams Freely Inside Icu
Jyothi Gadda
|

Updated on: Nov 20, 2022 | 4:36 PM

Share

ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లోకి ఎవరినీ అనుమతించరు. కొన్నిసార్లు రోగి బంధువులలో ఒక్కరిని మాత్రమే డాక్టర్ అనుమతిపై చేర్చుకుంటారు. అయితే ఇక్కడ మాత్రం ఓ ఆవు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లోకి ప్రవేశించి బహిరంగ మైదానంలా తిరుగుతోంది.  ఐసీయూ వార్డులో అటు ఇటూ చక్కర్లు కొడుతుంది. ఈ  ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఆసుపత్రి లోపల హాయిగా తిరుగుతున్న ఆవు అక్కడ చెత్త డబ్బాల్లో వేసిన వైద్య వ్యర్థాలను తింటోంది.  రోజంతా ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డులు ఆస్పత్రిలోనే ఉన్నప్పటికీ ఆవును తరిమికొట్టే వారు లేరు. అలాగే, ఈ ఆసుపత్రిలో విచ్చలవిడి పశువులను ఆపలేకపోయారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సెక్యూరిటీ గార్డు, ఇద్దరు ఆసుపత్రి సిబ్బందిని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు.

ఈ సంఘటనపై జిల్లా ఆసుపత్రి సర్జన్ రాజేంద్ర కటారియా మాట్లాడుతూ.. ఈ సంఘటన తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. వార్డు బాయ్, సెక్యూరిటీ గార్డుపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. పాత కోవిడ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వార్డులో ఈ ఘటన జరిగిందని ఆసుపత్రి వర్గాల ద్వారా తెలిసిందన్నారు.

ఇవి కూడా చదవండి

దీనిపై స్పందించిన మధ్యప్రదేశ్ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ప్రభురామ్ చదుదరి ఈ ఘటన గురించి తనకు తెలియదని అన్నారు. అయితే ఆ వీడియో వైరల్ కావడంతో ముగ్గురిని సస్పెండ్ చేశారు. గతేడాది ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆసుపత్రి వార్డులో ఓ వీధి కుక్క హాయిగా తిరుగుతోంది. సెక్యూరిటీ గార్డులు ఆసుపత్రి గేటు వద్ద ఉండగా, ఆసుపత్రి బెడ్‌పై పడుకున్న కుక్క వారి ఎదుటే దొంగచాటుగా వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి ఘటనల పట్ల ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్