Horoscope Today: ఈరోజు ఈ రాశివారు వివాదాలకు దూరంగా ఉండడం మేలు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
రోజులో ఏ పనులు మొదలు పెట్టాలన్నా మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. దీంతో చాలా మంది తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో (నవంబర్ 21వ తేదీ ) కార్తీక సోమవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
Horoscope Today (21-11-2022): రోజులో ఏ పనులు మొదలు పెట్టాలన్నా మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. దీంతో చాలా మంది తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో (నవంబర్ 21వ తేదీ ) కార్తీక సోమవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేష రాశి: ఈ రాశివారు ఈరోజు మానసిక బలం కలిగే విషయాన్ని వింటారు. బంధువులతో సంతోషముగా గడుపుతారు. కీలక పనుల విషయంలో తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు అధిక శ్రమ పడకుండా చూసుకోవాలి. చేపట్టిన పనుల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధు, మిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు వివాదాలకు దూరంగా ఉండడం మేలు.. సకాలంలో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒత్తిడిని జయించడానికి అందరినీ కలుపుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది. కొందరి ప్రవర్తన వల్ల ఆత్మాభిమానం దెబ్బతింటుంది.
కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. మానసిక ధైర్యంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇతరుల సహకారంతో ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారికి చంద్ర బలం బలహీనంగా ఉంది.. కనుకవివాదాలకు దూరంగా ఉండడం మేలు. ముఖ్యమైన విషయాల్లో మీరు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. పని తీరుతో ప్రశంసలను అందుకుంటారు. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్య విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అభివృద్ధికి సంబంధించిన విషయంలో ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు ఏ పని మొదలు పెట్టినా సక్సెస్ అవుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేస్తారు.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు పట్టుదలతో అనుకున్నది పూర్తి చేస్తారు. అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండే విధంగా చూసుకోవాలి. అనవసర ఖర్చులు చేయాల్సి ఉంటుంది.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారికి అనుకున్న పనులు నెరవేరతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు కీలక విషయాల్లో బాధ్యతలను నెరవేర్చేదిశగా అడుగులు వేస్తారు. మానసికంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు.
కుంభ రాశి: ఈ రోజు ఈ రాశివారు కీలక వ్యవహారాల్లో మానసికంగా దైర్యం కోల్పోకుండా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మిశ్రమ కాలం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దల సలహాలతో ముందుకు సాగాల్సి ఉంటుంది.
మీన రాశి: ఈరోజు ఈ రాశివారు ఆనందంగా గడుపుతారు. అభివృద్ధికి సంబంధించిన వార్తను వింటారు. చేపట్టిన పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. శత్రుపీడ తగ్గుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)