మీ ఇంట్లో పక్షుల్ని పెంచుతున్నారా..? ఆ పంజరమే మీ విజయానికి అడ్డంకి అవుతుంది.. తస్మాత్‌ జాగ్రత్త..!!

అనవసరంగా ఇంటి శాంతికి భంగం కలుగుతుంది. కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవుతారు. పరిస్థితి చేయి దాటిపోతున్నప్పుడు మనం వాస్తు శాస్త్రంపై శ్రద్ధ చూపుతాము.

మీ ఇంట్లో పక్షుల్ని పెంచుతున్నారా..? ఆ పంజరమే మీ విజయానికి అడ్డంకి అవుతుంది.. తస్మాత్‌ జాగ్రత్త..!!
Birds Divorce
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 21, 2022 | 4:39 PM

చాలా మంది ప్రజలు తమ ఇళ్లల్లో పిల్లులు, కుక్కలతో సహా కొన్ని పక్షులను పెంచుతారు. వాటిని కూడా ప్రేమతో చూసుకుంటారు. కానీ కొన్ని వాస్తు నియమాలు పాటించకపోవడం వల్ల వారి ఇంటి వాస్తు దెబ్బతింటుంది. ఇంట్లో పక్షులను పెంచటం కోసం వాస్తు నియమాలు అతిక్రమించకూడదు. ప్రతిరోజూ మనం వాస్తు నియమాలకు విరుద్ధంగా ఎన్నో పనులు చేస్తుంటాం. కాబట్టి మనం విజయాన్ని సులభంగా పొందలేము. అనవసరంగా ఇంటి శాంతికి భంగం కలుగుతుంది. కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవుతారు. పరిస్థితి చేయి దాటిపోతున్నప్పుడు మనం వాస్తు శాస్త్రంపై శ్రద్ధ చూపుతాము. అంతకంటే ముందు మనం కొన్ని నియమాలు తెలుసుకుంటే మంచిది.

చాలా మందికి జంతువులు, పక్షులంటే చాలా ఇష్టం. ఇంట్లో పెంపుడు జంతువులతో పక్షులను పెంచుతారు. చిలుకలను పెంచేవారి సంఖ్య కూడా ఎక్కువే. వాస్తు శాస్త్రంలో పక్షులను ఇంట్లో ఉంచుకోవడం నిషిద్ధం. పక్షులు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయని నమ్ముతారు. పక్షులను వదిలి ఉండలేని వారు ఇంట్లో పక్షులను పెంచుకునేటప్పుడు కొన్ని వాస్తు నియమాలను పాటించాలి. లేకపోతే, దురదృష్టం మీ వెంటే ఉంటుంది. పక్షి గురించి వాస్తు శాస్త్రం ఏమి చెబుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

పక్షులను పెంచుకునే ముందు వాస్తు నియమాలను తెలుసుకోండి : పంజరం తలుపును మూసివేయవద్దు : పక్షులను పెంచుకునే వారు పంజరం తలుపులు మూసివేయరాదు. మీ పెంపుడు జంతువుపై చూపించే అంతటి ప్రేమ, శ్రద్ధ చూపిస్తే దానికి పంజరం అవసరం లేదు. అది ఎక్కడికి వెళ్లినా తిరిగి మీ ఇంటికే వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పంజరం తలుపు పెట్టడం శుభసూచకం కాదు. పక్షిని పంజరంలో ఉంచడం కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇది ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

పక్షుల సేవ ముఖ్యం: పక్షులు శ్రేయస్సు, విజయానికి చిహ్నాలు. వాటికి సేవ చేయడాన్ని పుణ్య కార్యంగా భావిస్తారు. పక్షులకు మొక్కజొన్న తినిపిస్తే శుభ ఫలితాలు లభిస్తాయి. పక్షిని రోజంతా బోనులో ఉంచితే ఇంట్లో స్థిరత్వం ఉండదు. ఆర్థిక నష్టానికి దారి తీస్తోంది. పక్షి నిద్రిస్తున్నప్పుడు మాత్రమే మీరు పంజరాన్ని ఉపయోగిస్తే మంచిది.

ఇది పాపపు పని : పక్షిని ఇంటికి తీసుకురావడం మంచిది కాదు. స్వేచ్చగా ఎగురుతున్న పక్షిని గూడులో బంధించి ఉంచితే అనేక సమస్యలు వస్తాయి. పురాణాలలో కూడా పక్షులను పంజరాలలో ఉంచకూడదని చెప్పబడింది. పక్షులను పట్టుకోవడం పాపపు పనిగా జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

బుధవారం చిలుకను విడిచిపెట్టండి: చిలుకను బుధ గ్రహంతో పోల్చారు. మీరు చాలా మంది ఇళ్లలో అందమైన చిలుకలను పెంచుకోవటం చూసే ఉంటారు. అయితే, మీరు పంజరంలో ఉన్న చిలుకను విడిపించాలనుకుంటే అందుకు బుధవారం ఎంచుకోండి. మీరు తప్పనిసరిగా బుధవారం రోజున చిలుకను బంధి నుంచి విడిచిపెట్టాలి. దాన్ని మళ్లీ పట్టుకోవడానికి ప్రయత్నించవద్దు. దీని నుండి బుధుడు బలాన్ని అందిస్తాడు.

ఈ ఫోటోను ఇంట్లో ఉంచండి: వాస్తు ప్రకారం పక్షులను పెంచుకోవడం మంచి పని కాదు. మీకు జీవితంలో ఆనందం, విజయం కావాలంటే మీరు ఇంట్లో పక్షుల ఫోటోను ఉంచవచ్చు. పక్షుల ఫోటోలు ముఖ్యంగా చిలుకలు ఇంట్లో సానుకూల ఫలితాలను తెస్తాయి. దీని నుండి విజయం మీ సొంతమవుతుంది.

మరిన్ని వాస్తు సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో