AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Mantra: మనిషి జీవితంలో క్షమాపణ ప్రాముఖ్యత గురించి తెలిపే ఐదు విలువువైన వ్యాఖ్యలు మీ కోసం..

క్షమాపణ ఎల్లప్పుడూ మనిషికి ప్రయోజనకరంగా ఉంటుందని అనేక విషయాల ద్వారా రుజువు అయింది. అవును క్షమాపణ.. మ౦టల్లా రగులుతున్న గొడవల్ని ఆర్పేస్తు౦ది. దీనికి విరుద్ధంగా కోపంతో.. ఉన్న వ్యక్తి తనకు తాను నష్టాన్ని పొందుతాడు.

Success Mantra: మనిషి జీవితంలో క్షమాపణ ప్రాముఖ్యత గురించి తెలిపే ఐదు విలువువైన వ్యాఖ్యలు మీ కోసం..
Forgiveness Quotes
Surya Kala
|

Updated on: Nov 24, 2022 | 8:15 AM

Share

తప్పులు చేయడం మానవ సహజం.. ఆ తప్పులను తెలుసుకుని ఎదుటివారికి క్షమాపణ చెప్పాలి లేదా ఇతరుల తప్పులను క్షమించవలసి వచ్చినప్పుడు దయతో వారిని క్షమించాలి. కొన్ని సార్లు మనం తప్పు చేయనప్పటికీ ఇతరులకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయితే.. ఇటువంటి సమయంలో కూడా సహనం కోల్పోకుండా క్షమాపణ చెప్పడం ఆ వ్యక్తికీ ఆభరణం అంటారు. క్షమగుణంలో చాలా శక్తి ఉంది. ఇంకా చెప్పాలంటే .. ఈ గుణం ఇది చాలా తక్కువ మందిలో కనిపించే దైవిక లక్షణం. ఏ మతమైనా ఇతరులను క్షమించమని బోధిస్తుంది. ఇలా క్షమను కోరడం వలన ఇచ్చేవాడు,  స్వీకరించేవాడు ఇద్దరూ ఆనందాన్ని పొందుతారు. క్షమాపణ ఎల్లప్పుడూ మనిషికి ప్రయోజనకరంగా ఉంటుందని అనేక విషయాల ద్వారా రుజువు అయింది. అవును క్షమాపణ.. మ౦టల్లా రగులుతున్న గొడవల్ని ఆర్పేస్తు౦ది. దీనికి విరుద్ధంగా కోపంతో.. ఉన్న వ్యక్తి తనకు తాను నష్టాన్ని పొందుతాడు. ఈ నేపథ్యంలో ఈరోజు జీవితంలో క్షమాపణ ప్రాముఖ్యతను తెలిపే 5 విలువైన వ్యాఖ్యల గురించి తెలుసుకుందాం..

  1. జీవితంలో ఎవరికైనా మొదట క్షమాపణ చెప్పే వ్యక్తి నిజంగా ధైర్యవంతుడు. ముందుగా క్షమించేవాడు అత్యంత శక్తివంతుడు.
  2. గతంలో నీకు ఉపకారం చేసిన వాడు పెద్ద నేరం చేసినా అతని ఉపకారాన్ని గుర్తుంచుకుని క్షమించు.
  3. క్షమ మతం, క్షమాపణ త్యాగం, క్షమాపణ వేదం, క్షమాపణ గ్రంథం. జీవితానికి సంబంధించిన సత్యాన్ని తెలుసుకున్నవాడి దృష్టిలో ప్రతిదీ క్షమించదగినదిగా కనిపిస్తుంది.
  4. క్షమ తేజస్వి మహిమ, క్షమ బ్రాహ్మణత్వం, క్షమ సత్యం, క్షమాపణ ఒక త్యాగం ..  క్షమాపణ అనేది పరమ ధర్మం
  5. ఇవి కూడా చదవండి
  6. ఎవరికైనా క్షమాపణలు చెప్పడం అంటే మనం తప్పు అని.. అవతలివారు ఒప్పు అని ఎప్పుడూ రుజువు చేయడం కాదు. క్షమాపణ చెప్పడం నిజమైన సుగుణం ఏమిటంటే.. మానవ సంబంధాలను కొనసాగించే సామర్థ్యం తదుపరి వ్యక్తి కంటే క్షమాపణ చెప్పే లేదా క్షమించే గుణం గలిగిన వ్యక్తుల్లో ఎక్కువగా ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)