కారులో కుళ్లిన స్థితిలో యువతి మృతదేహం లభ్యం.. సహోద్యోగి అరెస్ట్.. ఆరా తీయగా..

శరీరంపై ఎలాంటి మచ్చలు లేవు. ఆమె గొంతు నులిమి హత్య చేసి ఉండవచ్చు. పోస్టుమార్టం తర్వాతే మరిన్ని వివరాలు తెలుస్తాయని వెల్లడించారు.

కారులో కుళ్లిన స్థితిలో యువతి మృతదేహం లభ్యం.. సహోద్యోగి అరెస్ట్.. ఆరా తీయగా..
Crime News
Follow us

|

Updated on: Nov 20, 2022 | 8:53 PM

బిలాస్‌పూర్‌లోని కస్తూర్బా నగర్ ప్రాంతంలో కారులో కుళ్లిపోయిన యువతి మృతదేహం లభ్యమైంది. హత్య జరిగిన నాలుగు రోజుల తర్వాత, శాంత్రో కారు వెనుక సీటులో సీటు కవర్‌లో చుట్టి పాక్షికంగా కుళ్లిపోయిన మృతదేహం కనిపించింది. పార్క్ చేసిన కారు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన వెలుగులోకి వచ్చింది. మృతురాలిని భిలాయ్‌కు చెందిన ప్రియాంక సింగ్ (24)గా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి కస్తూర్బా నగర్‌కు చెందిన ఆశిష్ సాహు అనే వ్యక్తిని దర్యాప్తు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆశిష్ యువతిని హత్య చేసి మృతదేహాన్ని తన సొంత కారులో ఉంచి తన నివాస స్థలంలో పార్క్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

అశిష్‌ సాహు, ప్రియాంక ఇద్దరూ స్టాక్ మార్కెట్‌లో పనిచేస్తున్న సహచరులు. ఆశిష్ మరో వైపు మెడికల్ డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నాడు. బాధితురాలు తాను ఉంటున్న దయాళ్ బ్యాండ్ శాంతి హాస్టల్ నుంచి కనిపించకుండా పోయింది. అనంతరం ఆమె సోదరుడు నవంబర్ 15న కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్‌పై ఫిర్యాదు చేశాడు. ప్రియాంక కాల్ రికార్డులు తనిఖీ చేయగా నిందితుడి క్లూ దొరికింది. నిందితుడి ఇంటి ఆవరణలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ప్రియాంకను హత్య చేసినట్లు ఆశిష్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉందని, హత్యగా కనిపిస్తోందని ఫోరెన్సిక్ నిపుణుడు ప్రవీణ్ సోనీ తెలిపారు. శరీరంపై ఎలాంటి మచ్చలు లేవు. ఆమె గొంతు నులిమి హత్య చేసి ఉండవచ్చు. పోస్టుమార్టం తర్వాతే మరిన్ని వివరాలు తెలుస్తాయని వెల్లడించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడని, తదుపరి విచారణ జరుపుతున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి