AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేవీ మాజీ ఉద్యోగి దారుణ హత్య.. మృతదేహాన్ని 6 ముక్కలుగా నరికి విసిరేసిన భార్య, కొడుకు

నేవీ రిటైర్డ్ ఉద్యోగిని అతని భార్య, కుమారుడు కలిసి గొంతుకోసి హత్య చేశారు. మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడేసిన షాకింగ్ సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

నేవీ మాజీ ఉద్యోగి దారుణ హత్య.. మృతదేహాన్ని 6 ముక్కలుగా నరికి విసిరేసిన భార్య, కొడుకు
Son Kills Ex Navy Man
Jyothi Gadda
|

Updated on: Nov 20, 2022 | 6:01 PM

Share

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్‌ హత్య ఉదాంతం మరువక ముందే అటువంటిదే మరో దారుణ ఘటన వెలుగు చూసింది. శ్రద్ధా వాకర్‌ని 35 ముక్కలుగా చేసిన నిందితుడు ఎటువంటి సాక్ష్యాదారాలు దొరక్కుండా తెలివిగా ప్లాన్‌ చేశాడు. శ్రద్ధా కేసు ఓ కొలిక్కి రాకముందే.. ఇదే తరహాలోనే పశ్చిమ బెంగాల్‌లో నేవీ మాజీ ఉద్యోగిని హత్య చేశారు. నేవీ రిటైర్డ్ ఉద్యోగిని అతని భార్య, కుమారుడు కలిసి గొంతుకోసి హత్య చేశారు. మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడేసిన షాకింగ్ సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. హత్యకు గురైన వ్యక్తి ఉజ్జల్ చక్రవర్తి (54)గా గుర్తించారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బరుయ్‌పూర్ నివాసి. గతంలో నేవీలో పనిచేసి 2000లో పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్టుగా తెలిసింది. అయితే, నవంబర్ 14న ఉజ్జల్ చక్రవర్తిని అతని భార్య, కొడుకు ఇంట్లోనే హత్య చేశారు. దీన్ని కప్పిపుచ్చేందుకు, మరుసటి ఉజ్జల్ చక్రవర్తి అదృశ్యమైనట్లు అతని భార్య, కుమారుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఉజ్జల్ చక్రవర్తి మిస్సింగ్ ఫిర్యాదును దాఖలు చేసిన పోలీసుల దర్యాప్తులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చింది. తల్లీకొడుకులు ఏదో చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు.. దీంతో ఫిర్యాదు చేసిన తల్లీ కొడుకులిద్దరినీ పోలీసులు ముందుగా విచారించారు. అప్పుడు ఉజ్జల్ చక్రవర్తి హత్యలోని నిజా నిజాలు బయటపడ్డాయి.

ఉజ్వల్ చక్రవర్తి మద్యం సేవించి భార్య, కొడుకుతో గొడవపడేవాడని చెప్పారు.. గత సోమవారం అంటే నవంబర్ 14న చక్రవర్తి ఇంట్లో నానా హంగామా చేశాడు. ఈ కారణంగా కొడుకు కోపంతో చక్రవర్తిని నెట్టాడు. కింద పడిన చక్రవర్తిని తల్లి, కొడుకు గొంతుకోసి హత్య చేసినట్లు విచారణలో తేలిందని ఎస్పీ పుష్ప తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఉజ్జల్‌ చక్రవర్తిని హత్య చేసిన తల్లీకొడుకులు మరో ఖర్తానక్‌ ప్లాన్‌ వేశారు. మృతదేహాన్ని ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లేందుకు ఆయుధాలతో ఆరు ముక్కలుగా నరికి వేశారు. మృతదేహం ముక్కలను సైకిల్‌పై తరలించి వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని ఎస్పీ తెలిపారు.

ఈ క్రమంలోనే గురువారం రాత్రి బరుయ్‌పూర్-మల్లిక్‌పూర్ రోడ్డులోని దిహి ప్రాంతంలోని చెరువులో ఉజ్వల్ చక్రవర్తి సగం మృతదేహం లభ్యమైంది. ముఖానికి కూడా ప్లాస్టిక్ కవర్‌ చుట్టి ఉంది. రెండు చేతులు, నడుము కింది భాగాల కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. నిందితులైన తల్లీకొడుకులను అరెస్టు చేసి తదుపరి విచారణ చేపట్టినట్లు ఆయన తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి