ద్విచక్ర వాహనదారులే లక్ష్యంగా దోపిడీ దొంగల దాడులు.. బైకర్లను వెంబడించి మరీ..

దుండగులు పోలీసులు, న్యాయ వ్యవస్థకు ఏ మాత్రం భయపడకుండా వ్యవహరిస్తున్నారని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ద్విచక్ర వాహనదారులే లక్ష్యంగా దోపిడీ దొంగల దాడులు.. బైకర్లను వెంబడించి మరీ..
Robbery In Amritsar
Jyothi Gadda

|

Nov 21, 2022 | 3:15 PM

పంజాబ్ అమృత్​సర్​లో దొంగలు రెచ్చిపోయారు. బైక్​పై వెళ్తున్న ఇద్దరిని వెంబడించి వారిని లూటీ చేశారు. రెండు ద్విచక్రవాహనాలపై వచ్చిన దొంగలు మరో బైక్​కు అడ్డుగా వచ్చి వారిని ఆపేశారు. బెదిరిస్తూ విలువైన వస్తువులను చోరీ చేశారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగిందీ ఘటన.

అయితే, అమృత్‌సర్‌లో ఇలాంటి ఘటనలు జరగడం ఇదేం మొదటి సారి కాదు. అమృత్‌సర్‌ నగరంలోన దుండగులు దౌర్జన్యాలు, దోపిడీ దొంగల దాడులు వరుసగా జరుగుతున్నాయి. గత మూడు రోజులుగా ఇదే తరహా ఘటనలు జరగడం స్థానికుల్ని భయాందోళనకు గురిచేస్తోంది. దుండగులు పోలీసులు, న్యాయ వ్యవస్థకు ఏ మాత్రం భయపడకుండా వ్యవహరిస్తున్నారని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఇటీవల ఒక ఆభరణాల వ్యాపారి మీద దొంగలు దాడికి తెగబడ్డారు. ఇద్దరు దొంగల్లో ఒకరిని ఆత్మరక్షణ కోసం కాల్చి చంపాడు సదరు వ్యాపారి. ఇద్దరూ దొంగలు వ్యాపారిపై దాడి చేసిన దోపిడీ చేయాలని ప్రయత్నించారు. వ్యాపారి ప్రతిఘటించటంతో ఒక దొంగ ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి సంఘటన స్థలం నుండి పారిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మరో సంఘటనలో రాత్రి 11 గంటల సమయంలో దుండగులు దొంగతనానికి వచ్చారు. ముఖానికి మాస్క్‌లు ధరించి మోటారు సైకిల్‌పై వచ్చిన ఐదుగురు దుండగులు బైక్‌ వెళ్తున్న దంపతులను అడ్డుకున్నారు. ఆ దంపతుల వద్ద గల మొబైల్‌ఫోన్లు, పర్సులు, నగదు, నగలు మొత్తం అపహరించారు. ఈ ఘటన అమృత్‌సర్‌లోని 100 అడుగుల రోడ్డులో జరిగింది. తాజాగా జరిగిన ఘటన మూడవదిగా పోలీసులు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. వరుస ఘటనలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu