Vastu Tips: కుటుంబంలో కలహాలా.? మీ లివింగ్ రూమ్‌లో ఈ వాస్తు లోపాలున్నాయేమో చూసుకోండి..

ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులపై వాస్తు ప్రభావం చూపుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాస్తు శాస్త్రం ప్రకారం లివింగ్‌ రూమ్‌ నిర్మాణ శైలి కుటుంబ సభ్యుల మధ్య కలహాలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఎక్కువ సమయం గడిపే హాల్‌లో వాతావరణం బాగుంటేనే ఇంట్లో కుటుంబ..

Vastu Tips: కుటుంబంలో కలహాలా.? మీ లివింగ్ రూమ్‌లో ఈ వాస్తు లోపాలున్నాయేమో చూసుకోండి..
Vastu Tips For Hall
Follow us

|

Updated on: Nov 21, 2022 | 8:25 PM

ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులపై వాస్తు ప్రభావం చూపుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాస్తు శాస్త్రం ప్రకారం లివింగ్‌ రూమ్‌ నిర్మాణ శైలి కుటుంబ సభ్యుల మధ్య కలహాలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఎక్కువ సమయం గడిపే హాల్‌లో వాతావరణం బాగుంటేనే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. అంతేకాకుండా ఆరోగ్యం, డబ్బు, ఆనందం వంటి వాటిపై వాస్తు దోషాలు ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.

వాస్తు ప్రకారం ఇంట్లో లివింగ్ రూమ్ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి. హాల్‌ డోర్‌ను తూర్పు లేదా ఉత్తరంలో ఏర్పాటు చేయాలి. హాల్‌లో ఈశాన్య మూలన దేవాతామూర్తులను ఉంచాలి. హాల్‌లో ఆహ్లాదకరమైన పెయింటింగ్‌లు ఉండేలా చూసుకోవాలి. ప్రతికూల శక్తిని వర్ణించే విధంగా ఉన్న వాటిని ఏర్పాటు చేయకూడదు. ఇంటి లివింగ్ రూమ్ లో ఈశాన్య మూలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక హాల్‌లో లైట్‌ కలర్స్‌ ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలి. ఇవి ఆనందకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. లివింగ్ రూమ్ గోడలకు ఎరుపు మరియు నలుపు రంగులను వెయ్యకూడదు.

ఇక హాల్‌లో ఎట్టి పరిస్థితులో పని చేయని గడియారాన్ని ఏర్పాటు చేయకూడదు. ఎందుకంటే ఇది కుటుంబ సభ్యుల రాశిచక్ర గుర్తులపై ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది. సోఫాలు, కప్‌బోర్డ్‌లు, టేబుల్స్‌ను హాల్‌ పశ్చిమ లేదా దక్షిణ మూలలో ఉంచాలి. అదే విధంగా లివింగ్‌ రూమ్‌ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..