Telangana: గర్భిణులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా టిఫా స్కానింగ్ కేంద్రాలు..
గర్భిణులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా టిఫా స్కానింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. రెండు మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా గర్భిణుల కోసం..
గర్భిణులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా టిఫా స్కానింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. రెండు మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా గర్భిణుల కోసం 58 టిఫా స్కానింగ్ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని కళాభవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన ఏఎన్ఎంల 2వ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కొవిడ్ సమయంలో ఏఎన్ఎంలు చేసిన విశేష సేవలకు అభినందనలు తెలిపారు. అందరూ కలిసి ఆరోగ్య తెలంగాణను నిర్మించాలని పిలుపునిచ్చారు. ఏఎన్ఎం కేంద్రాలను పల్లె దవాఖానాలుగా మారుస్తున్నట్టు మంత్రి తెలిపారు. 2014లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30శాతం డెలివరీలు అయ్యేవని ప్రస్తుతం అవి 67 శాతానికి పెరిగాయన్నారు.
ఈ విజయంలో ప్రతీ ఒక్కరి కష్టం ఉందన్న మంత్రి.. మెరుగైన వైద్యం అందించేందుకు ఏఎన్ఎంలు కృషి చేస్తున్నారని తెలిపారు. వారి సమస్యల పరిష్కారానికి తామూ కృషి చేస్తామని మంత్రి హరీశ్‌రావు ఏఎన్‌ఎంలకు హామీ ఇచ్చారు. ఇక ఇదే సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు సైతం చేశారు. డబుల్ ఇంజిన్ పెద్ద ట్రబుల్ ఇంజిన్ అంటూ ఎద్దేవా చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..