AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC Group 4 Notification: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! త్వరలో గ్రూప్‌-4 నోటిఫికేషన్‌.. మంత్రి హరీష్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లను జారీ చేసింది. ఆయా పోస్టులకు రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ కూడా ప్రారంభమైంది. ఇక మిగిలిన విభాగాల్లోని పోస్టులకు..

TSPSC Group 4 Notification: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! త్వరలో గ్రూప్‌-4 నోటిఫికేషన్‌.. మంత్రి హరీష్‌
Telangana Minister Harish Rao
Srilakshmi C
|

Updated on: Nov 13, 2022 | 1:51 PM

Share

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లను జారీ చేసింది. ఆయా పోస్టులకు రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ కూడా ప్రారంభమైంది. ఇక మిగిలిన విభాగాల్లోని పోస్టులకు సంబంధించిన జాబ్‌ ప్రకటనలను కూడా వెంటవెంటనే ప్రకటించనుంది. దీనిలో భాగంగా టీఎస్పీయస్సీ గ్రూప్‌ -4 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదివారం (నవంబర్‌ 13) తెలిపారు.

సిద్ధిపేట మల్టీ పర్పస్ హైస్కూలులో కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాలకు శిక్షణ పొందుతున్న దాదాపు 300 మంది అభ్యర్థులకు ఆదివారం ఉదయం మంత్రి హరీశ్ రావు సొంత ఖర్చుతో పాలు, ఉడకబెట్టిన కోడిగుడ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో ఈ విధంగా మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో 91 వేల ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేయనుంది. ఇక ఇప్పటికే రాష్ట్రంలో 17 వేలకు పైగా పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. ఆ శాఖలో మరో 2 వేల పోస్టులను కూడా భర్తీ చేస్తాం. వీటిల్లో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి హరీష్‌ అన్నారు. కేంద్రం అగ్నిపథ్‌ పేరుతో నిరుద్యోగులను నిండా ముంచిందని, యువత జీవితాల్ని నాశనం చేసే విధంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందని కేంద్ర ప్రభుత్వ తీరును మంత్రి విమర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.