IIT Delhi Recruitment 2022: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు అలర్ట్! ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ.. 19 సూపరింటెండింగ్‌ ఇంజనీరింగ్, మెడికల్ ఆఫీసర్‌ తదితర పోస్టుల..

IIT Delhi Recruitment 2022: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు అలర్ట్! ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..
IIT Delhi Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 13, 2022 | 10:48 AM

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ.. 19 సూపరింటెండింగ్‌ ఇంజనీరింగ్, మెడికల్ ఆఫీసర్‌, ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్‌, చీఫ్‌ సెక్యురిటీ ఆఫీసర్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఇంజనీరింగ్‌/టెక్నాలజీ విభాగాల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 40 నుంచి 55 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 30, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం నింపిన దరఖాస్తులను కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించివల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్ధులు రూ.500లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌, మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఎంపిక విధానం, జీతభత్యాలు వంటి ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • సూపరింటెండింగ్ ఇంజనీర్ పోస్టులు: 2
  • ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు: 7
  • చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు: 1
  • డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు: 2
  • అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు: 3
  • మెడికల్ ఆఫీసర్ పోస్టులు: 2
  • అసిస్టెంట్ స్టూడెంట్ కౌన్సెలర్ పోస్టులు: 2

అడ్రస్‌:

The Recruitment Cell, Room No. 207/C-7, Adjoining to Dy. Director (Ops)’s Office, IIT Delhi, Hauz-Khas, New Delhi – 110016.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.