- Telugu News Photo Gallery Koala Animal: World's most sleeping animal. know here interesting facts about this animal
Koala: ఇది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా నిద్రించే జంతువు.. రోజుకు ఎన్ని గంటలంటే..
ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ కనీసం 6 నుంచి 8 గంటలపాటు నిద్ర పోవాలని వైద్యులు చెబుతుంటారు. అంతకంటే తక్కువ నిద్రపోతే ఆరోగ్యం పాడవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఐతే రోజుకు 22 గంటల పాటు..
Updated on: Nov 13, 2022 | 11:22 AM

ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ కనీసం 6 నుంచి 8 గంటలపాటు నిద్ర పోవాలని వైద్యులు చెబుతుంటారు. అంతకంటే తక్కువ నిద్రపోతే ఆరోగ్యం పాడవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఎక్కువ నిద్రపోవడం వల్ల కూడా ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. ఐతే రోజుకు 22 గంటల పాటు నిద్రపోతే! మనిషేకాదు.. భూమిపై ఏ జంతువు అన్ని గంటలు నిద్రపోలేదని అనుకుంటున్నారా? ఐతే ఈ విషయం మీరు తెలుసుకోవల్సిందే..

ఇది కోలా అనే అడవి జంతువు. పూర్తిగా శాకాహారి. చెట్లపై కనిపించే ఈ జంతువు ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపిస్తుంది.

ఆస్ట్రేలియా తూర్పు ప్రాంతంలోని యూకలిప్టస్ అడవుల్లో ఈ విధమైన జంతువులు కనిపిస్తాయి. ఇవి రోజుకు ఒక కిలో యూకలిప్టస్ ఆకులు తింటాయట. ఈ ఆకులే వాటి ఏకైక, ప్రధాన ఆహారం.

దీనిని 'నో డ్రింక్' జంతువు అని కూడా అంటారు. ఇవి తమ జీవితకాలంలో ఒక్కసారి కూడా నీళ్లు తాగవట. కోలా జంతువులు తినే ఆకుల్లో ఉండే తేమ ద్వారానే జీవిస్తాయి.

రోజులోని 24 గంటల్లో దాదాపు 22 గంటలు నిద్రపోతుంటాయి. అందుకే దీనిని ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ గంటలు నిద్రించే జంతువుగా పిలుస్తారు.





























