Chiranjeevi: రాజకీయాలపై చిరు మరోసారి సెన్సేషన్ కామెంట్స్.. పవన్ గురించి మనసులో మాట బయట పెడుతూ..
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ అడపాదడపా పాలిటిక్స్ గురించి ఏదో ఒక వ్యాఖ్య చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో నిలుస్తున్నారు..

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ అడపాదడపా పాలిటిక్స్ గురించి ఏదో ఒక వ్యాఖ్య చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో నిలుస్తున్నారు చిరంజీవి. ఈక్రమంలోనే తాజాగా చిరంజీవి మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎర్రమిల్లి నారాయణమూర్తి కాలేజ్ అల్ముని వెల్ ఫేర్ అసోషియన్ హైదరాబాద్ వారు ఆదివారం నిర్వహించిన పూర్వమిత్రుల సమ్మేళనంలో మాట్లాడిన చిరు రాజకీయాలపై మాట్లాడి మరోసారి చర్చకు దారి తీశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లోకి దిగాను కాను దాని అంతు చూడలేక పోయాను. రాజకీయాల్లో రాటుదేలాలి. మౌనంగా ఉంటే అసలే కుదరదు.. మాటలు అనాలి, అనిపించుకోవాలి. రాజకీయాల్లో నెగిటివ్‌గా ఉంటే రాణించడం చాల కష్టం. నేను రాజకీయం అంతు చూడలేక పోయిన పవన్ వల్ల ఇది సాధ్యం అవుతుుంది. పవన్ నాలుగు మాటులంటాడు…నాలుగు మాటలు పడుతాడు. భవిష్యత్తులో పవన్‌ను మంచి స్ధానంలో చూస్తాం.. దానికి మీఅందరి సహాకారం కావాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.
గత కొన్ని రోజులుగా చిరు రాజకీయాలను ఉద్దేశించి చేస్తోన్న వార్తలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోన్న విషయం తెలిసిందే. మొన్నటి మొన్న అనంతపురంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపాయి. ఏం చేసినా చూస్తూ ఊరుకోనంటూ హెచ్చరించి అంశం వైరల్ అయింది విధితమే. అయితే పవన్‌ను ఉద్దేశిస్తూ చిరు తొలిసారి స్పందించారు. చిరు తాజాగా చేసిన వ్యాఖ్యలతో పవన్‌కు తన మద్ధతును పూర్తిగా ప్రకటించారన్న అనుమానాలు రాక మానదు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..







