AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఎముకల నొప్పులకు దివ్య ఔషధం పాయ షేర్వా.. హైదరాబాద్ రెస్టారెంట్ స్టైల్ లో రెసిపీ మీ కోసం..

ఎవరైన కాళ్లు, చేతులు లాగడం, ఎముకలు అరిగిపోతున్నాయని కొనేవారు..  కాల్షియం అవసరం అని భావించే దీనిని తీసుకోవడానికి ఎక్కువగా మక్కువ చూపుతారు. చలి కాలంలో మరి ఎక్కువగా ఉపయోగిస్తారు. పాతబస్తీలో దీనికి హైదరాబాద్ బిర్యానీ తరువాత అంతటి ప్రాధాన్యతను కలిగింది. నాన్ రోటీ తో కలిసి ఆరగిస్తే ఆహా.. అనిపించేలా ఉంటుంది. 

Hyderabad: ఎముకల నొప్పులకు దివ్య ఔషధం పాయ షేర్వా.. హైదరాబాద్ రెస్టారెంట్ స్టైల్ లో రెసిపీ మీ కోసం..
Paya Shorba In Old City
Surya Kala
|

Updated on: Nov 20, 2022 | 4:38 PM

Share

పాతబస్తీ ఇరానీ చాయ్.. దమ్ కి బిర్యానికి ఎంత ప్రాధాన్యమో.. అంతకు మించి ప్రాముఖ్యతను సంతరించుకుంది పాయ షేర్వా.. శీతాకాలం వచ్చిందంటే చాలు… దీని అమ్మకాలు ఓ రేంజ్ లో జరుగుతాయి. చలికాలంలో మరి మక్కువగా ఇష్టపడుతారు హైదరాబాద్ వాసులు. పాతబస్తీలోని హోటల్లో పాయ షేర్వా మరగ్ సాయంత్రం నుంచి ఉదయం వరకు ప్రత్యేక అల్పహారంగా దొరుకుతుంది. దీనిలో ఆరోగ్యానికి ఎంతో దోహదం చేసే పోషక విలువలు ఉన్నాయి. ఎవరైన కాళ్లు, చేతులు లాగడం, ఎముకలు అరిగిపోతున్నాయని కొనేవారు..  కాల్షియం అవసరం అని భావించే దీనిని తీసుకోవడానికి ఎక్కువగా మక్కువ చూపుతారు. చలి కాలంలో మరి ఎక్కువగా ఉపయోగిస్తారు. పాతబస్తీలో దీనికి హైదరాబాద్ బిర్యానీ తరువాత అంతటి ప్రాధాన్యతను కలిగింది. నాన్ రోటీ తో కలిసి ఆరగిస్తే ఆహా.. అనిపించేలా ఉంటుంది.

పాయ అంటే… పాయ షేర్వా మంచి రుచిగలది. సాయ అంటే కాలు అని అర్థం మేక, పొట్టేళ్ల కాళ్లను ఉడికించి తయారు చేసే ఆహారం పదార్ధం. పోట్టేల కాళ్లను ఉడికించిన మసాల దినుసుల రసంను షేర్వా అంటారు. ఈ పాయ షేర్వా  దొరికే హోటళ్ల పాతబస్తీలో ఉన్నాయి.

శీతకాలంలో ఎక్కువగా… సంవత్సరం పొడవున ఈ పాయ షేర్వా లభిస్తున్నప్పటికీ ఎక్కువగా ఆల్బహారంగా శ్రీతకాలంలో ఉపయోగిస్తుంటారు. పాతబస్తీ హోటళ్లలో సాయంకాలం నుండే హోటళ్ల ముందు పెద్ద పెద్ద డేగాలు దర్శనమిస్తాయి. సాయంకాలం నుండి తెల్లవార్లు పాయ… షేర్వా… మరగ్ కోసం కిటకిటలాడుతుంటాయి. ప్రధానంగా మదీనా, చార్మినార్, ఫలక్ నుమా, టోలిచౌకి తదితర ప్రాంతాలలోని హోటళ్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. పాతబస్తీలో కొన్ని తరాల నుంచి వారసత్వంగా పాయ హోటళ్లు నిర్వహిస్తున్నారు. కేవలు పాయ కోసం హోటళ్లకు వచ్చే వారున్నారని హోటల్ నిర్వాహకులు అంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తింటుంటారని, పార్సల్ తీసుకెళ్తుంటారన్నారు.

తయారీ… పాయ తయారీలో లేత మేక, పొట్టేలు కాళ్లను ఒక పెద్ద వంట పాత్రలో వేసి నీటిని పోసి సమారు ఎనిమిది గంటల పాటు బాగా ఉడికిస్తారు. ఉడికిన మేక కాళ్లను ప్రత్యేకంగా తయారు చేసిన మసాల దినుసులతో షేర్వాన హరీ)లో వేసుకొని అరగిస్తారు. ఈ షేర్వాను కొబ్బరి, జీడిపప్పు, పల్లీలు, గరంమసాలలతో పాటు పోటీకా మసాలలు కలిపి బాగా మరగబెడతారు. పూర్తిగా తయారయిన షేర్వాలో అప్పటికే బాగా ఉడకబెట్టిన మేక కాళ్లను వేస్తారు. దీనిపై కొత్తిమీర చల్లడంతో సహారీ, పాయ తయారీ పూర్తి అయినట్లే షేర్వా తయారీలో వాడే పోటీకా మాసాలలో.. వివిధ ఔషద గుణాలు కలిగిన మొక్కల ఆకులు, వేర్లు కలిసి ఉంటాయి. ఈ మసాలలు వాడడం వలన సహారీకి. మంచి రుచికరంగా తయారవుతుంది. అంతే కాకుండా వివిధ ఔషధ గుణాలు కలిగిన పోటీకా మసాలలు వాడడం వలన ఆరోగ్యానికి మేలు చేస్తుందని పాయను ఎక్కువగా తినేవారు చెప్తుంటారు. ఈ పాయ షేర్వా లు తినడంతో ఎముకలు దృఢత్వాన్ని పొందుతాయంటారు

రిపోర్టర్:నూర్, Tv9 Telugu

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..