Health: ఎక్కిళ్లు ఎంతకీ తగ్గడం లేదా.. ఈ పద్ధతులు పాటించండి.. అంతే ప్రాబ్లమ్ సాల్వ్..

ఎక్కిళ్లు రావడం సహజమే. ఇవి అందరికీ వస్తాయి. సాధారణంగా ఇవి కొంత సమయం ఉండి, తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి. ఎక్కిళ్లు వచ్చినప్పుడు నీళ్లు తాగుతుంటాం. ఇలా చేస్తే ఇవి తగ్గిపోతాయి. కానీ కొందరిలో...

Health: ఎక్కిళ్లు ఎంతకీ తగ్గడం లేదా.. ఈ పద్ధతులు పాటించండి.. అంతే ప్రాబ్లమ్ సాల్వ్..
Hickups Health
Follow us
Ganesh Mudavath

|

Updated on: Nov 20, 2022 | 8:34 AM

ఎక్కిళ్లు రావడం సహజమే. ఇవి అందరికీ వస్తాయి. సాధారణంగా ఇవి కొంత సమయం ఉండి, తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి. ఎక్కిళ్లు వచ్చినప్పుడు నీళ్లు తాగుతుంటాం. ఇలా చేస్తే ఇవి తగ్గిపోతాయి. కానీ కొందరిలో స్టార్ట్‌ అయిన వెంటనే తగ్గవు. నీళ్లు తాగినా ఆగవు.  ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. అలాంటి పరిస్థితుల్లో చాలా విసుగు కలుగుతుంది. సాధారణంగా భోజనం చేసేటప్పుడు, నీరు తాగే సమయంలో పొలమారుతుంది. అప్పుడు మనం వెంటనే నీటిని తాగుతాం. ఇది కొన్ని సందర్భాల్లో ఎక్కిళ్లకూ దారి తీస్తుంది. అయితే చాలా మంది ఎవరో తలుచుకోవడం వల్లనో, తమ గురించి మాట్లాడుకోవడం వల్లనో ఇలా జరుగుతుందని భావిస్తుంటారు. కానీ అసలు నిజం అది కాదు. ఛాతీని, కడుపును వేరు చేసే డయాఫ్రం పొర హఠాత్తుగా సంకోచించటం వల్ల ఎక్కిళ్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో స్వరపేటిక కొద్దిసేపు మూసుకుపోయి శబ్ధం వస్తుంది. వీటినే ఎక్కిళ్లు అంటారు.

డయాఫ్రం చికాకుకు గురవటం, నాడీ సంకేతాలు అందకపోవటం వల్ల ఎక్కిళ్లు వస్తాయి. ఆహారంలో మార్పులు చేసినా కొన్ని సందర్భాల్లో ఇవి వస్తుంటాయి. చాలావరకు ఎక్కిళ్లు కొద్దిసేపటికి వాటంతటవే తగ్గిపోతాయి. కొన్ని సార్లు ఎక్కువ సేపు వేధిస్తూ ఉంటాయి. ఎక్కిళ్లను ఆపడానికి ఎన్నో పద్ధతులు పాటిస్తారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కిళ్లను ఆపేందుకు చాలా మంది నీటిని తాగుతుంటారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే నీటితో నే కాకుండా ఇతర పదార్థాలనూ ఉపయోగించి ఎక్కిళ్లను తగ్గించుకోవచ్చు.

ఎక్కిళ్లను ఆపడంలో యాలకుల పొడి అద్భుతంగా పని చేస్తుంది. ఒక గ్లాస్‌ నీటిలో చెంచా యాలకుల పొడి వేసి మరిగించాలి. ఆ నీటిని చల్లార్చి తాగితే ఎక్కిళ్లు తగ్గుతాయి. ఎక్కిళ్లను ఇబ్బంది పడుతుంటే టీ స్పూన్‌ చక్కెర నోట్లో వేసుకుని నెమ్మదిగా చప్పరించాలి. ఒక చెంచా పెరుగు తింటే చాలు. ప్రాబ్లమ్ సాల్వ్.. ఎక్కిళ్ల నుంచి త్వరగా ఉపశమనం పొందాలంటే అల్లం ముక్కను నిదానంగా నమిలి తినాలి. అల్లంలో అనేక ఔషధ గుణాలు ఉండటం వల్ల ఎక్కిళ్లు తగ్గుతాయి. ఈ పద్ధతులన్నీ పాటించినా ఎక్కిళ్లు ఆగకుంటే వైద్యులను సంప్రదించాలి.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే