180కి పైగా సినిమాలు.. ఇప్పుడు అవకాశాలు లేక కాఫీ పొడి అమ్ముతున్న నటుడు
ఇండస్ట్రీలో అవకాశాలు లేక సినిమాలకు దూరంగా ఉంటున్న నటులు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న నటులు చాలా మంది ఉన్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటుడు చాలా ఫేమస్.. 180కి పైగా సినిమాల్లో నటించాడు ఆయన.

సినిమా ఇండస్ట్రీ అనేది అందరికి ఒకేలా ఉండదు.. ఎంత ప్రతిభ ఉన్నా కూడా అదృష్టం కూడా కలిసి రావాలి.. ఇండస్ట్రీలో అందరూ సక్సెస్ కాలేరు.. కొందరు కొన్ని సినిమాలకే పరిమితం అవుతుంటారు. కొందరు నటులు సినిమా అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న వారు కూడా ఉన్నారు ఎంతో మంది నటులు దీన స్థితిలో ఉన్నారు. తాజాగా ఓ నటుడు అవకాశాలు లేక ఓ షాప్ పెట్టుకున్నా అని తెలిపాడు ఇంతకూ ఆ నటుడు ఎవరో తెలుసా.? ఎన్నో సినిమాల్లో నటించి నవ్వులు పూయించాడు ఆ నటుడు.. ముఖ్యంగా హీరో ఫ్రెండ్స్ పాత్రల్లో అంటించాడు. తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు ఆ నటుడు ఇంతకూ అతను ఎవరో తెలుసా.? ఆయన ఎవరంటే..
Pawan Kalyan: రాజకీయాల్లోకి రావచ్చుగా.. హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ ఆఫర్.. కానీ ఆమె ఏం చెప్పిందంటే
హాస్యనటుడు తిరుపతి ప్రకాష్ గుర్తున్నారా.? ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరం ఉంటున్నారు తిరుపతి ప్రకాష్. గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తన జీవితంలో ఎదురైన సవాళ్లను, వాటిని ధైర్యంగా ఎదుర్కొని ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా మారిన తీరును ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు తిరుపతి ప్రకాష్. జబర్దస్త్ షోలో 2015 నుండి 2018 వరకు దాదాపు మూడేళ్లపాటు, 180కి పైగా ఎపిసోడ్‌లలో పాల్గొన్న తర్వాత, ఆయనకు సినీ అవకాశాలు సన్నగిల్లడం మొదలైంది. అలాంటి సమయంలోనే వ్యాపారంపై దృష్టి సారించారట. మొదట టిఫిన్ సెంటర్ లేదా కిరాణా షాపు పెట్టాలని అనుకున్నా, వంట లేదా ఇతర వ్యాపారాలపై అవగాహన లేకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకున్నా ఈ క్రమంలోనే మణికొండలో నివసించే తన దూరపు పెదనాన్న కాఫీ పొడి కోసం మోతినగర్ లేదా అమీర్‌పేట్‌కు వెళ్లడం చూసి, అదే ప్రాంతంలో కాఫీ పొడి షాపు పెట్టాలనే ఆలోచన ఆయనకు వచ్చిందట.
వెంకటేష్ నా ప్రాణం కాపాడారు.. ఆ రోజు ఆయన లేకపోయి ఉంటే వామ్మో..!!
మణికొండ పరిధిలో 16 కిలోమీటర్ల రేడియస్‌లో కాఫీ పొడి షాపులు లేవని తెలుసుకున్న ప్రకాష్, తన స్నేహితుడు చంద్ర కాఫీ వర్క్స్ యజమాని చంద్ర సహాయంతో కాఫీ పొడి, సీడ్స్ గురించి తెలుసుకున్నారు. 60/40 కాఫీ పొడి మిశ్రమం గురించి అధ్యయనం చేసి, తన వ్యాపారాన్ని ప్రారంభించారు. మొదటిలో 5 కిలోల సీడ్స్‌తో ప్రారంభమైన ఈ వ్యాపారం ప్రస్తుతం 1200 నుండి 1300 మంది కస్టమర్‌లను కలిగి ఉంది. ప్రకాష్ తన షాపును స్వయంగా చూసుకుంటారట. షాపు ఊడ్చడం, తడి గుడ్డ పెట్టడం, ఏసీ ఆన్ చేయడం, షట్టర్ తెరవడం వంటి పనులన్నీ తానే చేస్తాను అని తెలిపాడు. తన తండ్రి నేర్పిన కష్టపడే తత్వాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
Roja Selvamani: స్టార్ హీరో ఇంటికి కోడలిగా రోజా కూతురు..? ఇదిగో క్లారిటీ
View this post on Instagram




